‘కల్కి’ సినిమా ట్రైలర్ వచ్చేసింది..

- June 10, 2024 , by Maagulf
‘కల్కి’ సినిమా ట్రైలర్ వచ్చేసింది..

హైదరాబాద్: సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ట్రైలర్ విడుదలైంది. ప్రభాస్ హీరోగా ఈ సినిమాను సైన్స్ ఫిక్షన్, ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్ గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్‌తో పాటు అమితాబ్ బచ్చన్, కమలహాసన్ వంటి స్టార్టు, దీపికా పదుకొనె, దిశా పటానీ వంటి హీరోయిన్లు నటించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాకు నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 27న విడుదల కానుంది. ప్రభాస్ ఈ సినిమాలో భైరవ పాత్రలో కనపడుతున్నాడు. ప్రభాస్ వాహనం బుజ్జికి సంబంధించిన దృశ్యాలు చిన్నారుల నుంచి పెద్దల వరకు అందరినీ అలరించాయి.

ప్రభాస్ చేసిన సాహసాలను ఈ ట్రైలర్ తో చూపించారు. యాక్షన్ సీన్లు అదరగొట్టేశాయి. ట్రైలర్ లో ప్రభాస్ కనపడిన తీరు గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థియేటర్లలోనూ కల్కి ట్రైలర్ విడుదల చేశారు. థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు నానా హంగామా చేశారు. కాగా, కల్కి సినిమాలోని సీన్లు ఫొటోలు వంటివి ఎవరూ షేర్ చేయకూడదని ఆ మూవీ టీమ్ హెచ్చరించింది. నిబంధనలు ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయిస్తామని ఓ ప్రకటనలో పేర్కొంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com