ఒమన్‌లో వలసదారుల పెరుగుదల గణనీయం
- June 11, 2016
ఒమన్‌లో వలసదారుల జనాభా గడచిన ఐదేళ్ళుగా గణనీయమైన వృద్ధిని నమోదు చేసిందని నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ (ఎన్‌సిఎస్‌ఐ) గణాంకాలు తెలిపాయి. మొత్తం జనాభాలో ప్రస్తుతం 45.5 శాతం వలసదారులున్నారు. 2011లో వలసదారులు 38.9 శాతం ఉన్నారు. 2010లో ఇది 29 శాతంగా ఉంది. వలసదారుల్లో ఎక్కువమంది భారతీయులు కాగా, రెండో స్థానంలో బంగ్లాదేశ్‌కి చెందినవారున్నారు. భారతీయ వలసదారుల సంఖ్య 687,592 మంది, బంగ్లాదేశీయులు 630,433 మంది ఉన్నారు. ఒమన్ జనాభా ప్రస్తుతం 4.4 మిలియన్లు. ఇందులో ఒమన్ జాతీయులు 50.5 శాతం ఉంటారు. ఒమన్‌లో మెజార్టీ నివాసితులు రాజధాని మస్కట్‌లో నివసిస్తున్నారు. ఆ తర్వాతి స్థానం నార్త్ బతినాది.
తాజా వార్తలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్‌లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్‌ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..









