కన్నప్ప టీజర్ వచ్చేసింది..
- June 14, 2024
హైదరాబాద్: డ్రీం ప్రాజెక్టు ‘కన్నప్ప’ సినిమాని శరవేగంగా షూట్ చేస్తున్న సంగతి తెలిసిందే. న్యూజిలాండ్ అడవులతో పాటు, రామోజీ ఫిలిం సిటీలో సెట్స్ వేసి ఈ సినిమా షూటింగ్ చేశారు. మోహన్ బాబు ఈ సినిమాని దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమాలో మధుబాల, ప్రభాస్, నయనతార, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, అక్షయ్ కుమార్.. ఇలా చాలా మంది స్టార్స్ నటిస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.
ఇప్పటికే కన్నప్ప సినిమా ప్రమోషన్స్ భారీగానే చేస్తున్నారు. ఆల్రెడీ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో కన్నప్ప సినిమా టీజర్ ప్లే చేశారు. తాజాగా కన్నప్ప సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అయితే ఈ టీజర్ అందరికి అందుబాటులో ఉండేలా యూట్యూబ్ లో ఇంకా రిలీజ్ చేయలేదు. కొన్ని థియేటర్స్ లో కొంతమందికి మాత్రమే స్పెషల్ గా ఈ టీజర్ ప్లే చేశారు. అలాగే టీజర్ లాంచ్ ఈవెంట్లో ఈ టీజర్ ని ప్లే చేశారు. దీంతో ఈ టీజర్ లోని కొన్ని షాట్స్ వైరల్ అవుతున్నాయి.
కన్నప్ప సినిమాలో శివుడు కచ్చితంగా ఉంటాడని తెలిసిందే. దీంతో కన్నప్పాలో ప్రభాస్ శివుడుగ అనటిస్తున్నదని గతంలో వార్తలు వచ్చాయి. అయితే తాజాగా చూపించిన టీజర్ ప్రకారం అక్షయ్ కుమార్ శివుడిగా నటించినట్టు తెలుస్తుంది. అలాగే టీజర్ లో ప్రభాస్ కళ్ళని చూపిస్తూ ఓ షాట్ వేశారు. ఇక కన్నప్పని ఓ వీరుడిగా ఆచూపిస్తు యుద్ధ సన్నివేశాలతో టీజర్ ని అదరగొట్టేశారని తెలుస్తుంది. ఫుల్ టీజర్ యూట్యూబ్ లో రిలీజ్ చేయాలని అభిమానులు, సినిమా లవర్స్ అడుగుతున్నారు. కనై రేపే కన్నప్ప టీజర్ ని యూట్యూబ్ లో రిలీజ్ చేస్తారని సమాచారం.
తాజా వార్తలు
- గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్కు ఆహ్వానం







