వీడియో సాక్ష్యంతో బయటపడ్డ యజమాని, ఆసియా వ్యక్తి
- June 15, 2024
మనామా: 9-సెకన్ల వీడియో.. టైలర్ షాప్ యజమాని మరియు పర్మిట్ లేకుండా పని చేశాడని ఆరోపించబడిన ఒక ఆసియా వ్యక్తిని నిర్దోషిగా విడుదల చేయడానికి కారణమైంది. వీడియో సాక్ష్యం ఆధారంగా యజమానికి 1,000 దీనార్లు, ఆసియా వ్యక్తికి 20 దినార్లు జరిమానా విధించిన మునుపటి క్రిమినల్ ఆర్డర్‌ను రద్దు చేసేందుకు సహాయపడింది. లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) నుండి జ్యుడీషియల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ ఆఫీసర్ టైలర్ షాప్‌ను సందర్శించి, యజమానికి మరియు ఆసియన్ వ్యక్తికి సైటేషన్ జారీ చేయడంతో ఈ సంఘటన ప్రారంభమైంది. ఆసియన్ వ్యక్తిని ప్రశ్నించిన తర్వాత అనుమతి లేకుండా పని చేయడాన్ని ప్రత్యక్షంగా చూసినట్లు అధికారి పేర్కొన్నారు. అయితే, యజమాని తరఫు న్యాయవాది మహ్మద్ అల్ షరాబీ వాదిస్తూ.. ఆసియా వ్యక్తి సదరు యజమాని దగ్గర ఉద్యోగం చేయడం లేదని, కస్టమర్‌గా హాజరయ్యాడని వివరించారు. దీనికి బలం చేకూర్చే 9 సెకన్ల వీడియో రికార్డింగ్‌ను సమర్పించాడు. ఇది ఆసియన్ వ్యక్తి కస్టమర్ మరియు ఉద్యోగి కాదని యజమాని వాదనకు మద్దతుగా నిలిచింది. జ్యుడీషియల్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారి ఆసియా వ్యక్తి పనిచేస్తున్నట్లు చూడలేదని కోర్టు నిర్ధారించింది. అధికారి గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉండగా ఆసియా వ్యక్తి పై అంతస్తు నుంచి కిందకు వస్తున్నట్లు వీడియో సాక్ష్యం చూపించింది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







