‘కల్కి’ ప్రీ రిలీజ్ రికార్డులు బాగానే వున్నాయ్ కానీ.!
- June 15, 2024
ఈ మంత్ని ‘కల్కిమంత్’గా అభివర్ణిస్తున్నారు. అవును మరి, ప్రపంచం మొత్తం ఎంతో క్యూరియాసిటీతో ఎదురు చూస్తున్న సినిమా ఇది. టైమ్ ట్రావెల్ అంటున్నారు.. బోలెడంత మంది కాస్ట్లీ కాస్టింగ్ వుంది.
బడ్జెట్ కూడా ఓ రేంజ్. దర్శకుడిగా నాగ అశ్విన్ పైనా నమ్మకం బాగానే వుంది. ఇక, ప్రబాస్ ఇమేజ్ కెపాసిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. విజువల్ ఎఫెక్టులు గట్రా సినిమాని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లనున్నాయ్.
మరి, ఇంత హంగామాతో వస్తున్న ఈ సినిమా అంచనాల్ని అందుకుంటుందో లేదో ఈ నెలాఖరుకు తెలిసిపోనుంది. జూన్ 26న గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రీ రిలీజ్ బిజినెస్ రికార్డు స్థాయిలో జరుగుతోంది.
ముఖ్యంగా ఓవర్సీస్లో అయితే, ఇప్పటికే మిలియన్ డాలర్లు దాటేస్తోంది. ప్రీ టికెట్స్ ఓపెన్ చేయడమే ఆలస్యం హాట్ కేక్స్లా అమ్ముడు పోతున్నాయని అక్కడి అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం.
అలాగే తెలుగు రాష్ట్రాల్లోనూ అదే హైప్ కొనసాగుతోంది. దాంతో, ‘ఆర్ఆర్ఆర్’ రికార్డుల్ని సైతం ‘కల్కి’ ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రేక్ చేసిందని అంటున్నారు. మరి, ఇందులో నిజమెంత.? అసలు సినిమాలో విషయమెంత.? తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేస్తే సరిపోతుంది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







