నివేదా ‘పరువు’ సమస్య.! అసలు కథ ఇదీ.!
- June 15, 2024
ఈ మధ్య కారు డిక్కీ ఓపెన్ చేయమన్న పోలీసులతో వాగ్వాదానికి దిగి, ముద్దుగుమ్మ నివేదా పేతురాజ్ సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతీ తెలిసిందే. పోలీసులు తమ పని తాము చేసుకుపోతామని ఎంత బతిమలాడినా.. ‘పరువు’ సమస్య ప్లీజ్ అర్ధం చేసుకోండి.! అంటూనే ఒకింత ఆటిట్యూడ్ చూపిస్తూ నివేదా పేతురాజ్ సోషల్ ఫాలోవర్స్‌కి స్పెషల్ స్టఫ్ ఇచ్చింది.
ఇంతకీ ఆ స్టఫ్ ఎందుకంటారా.! అఫ్కోర్స్ అప్పుడే చాలా మంది గ్రహించారనుకోండి.. అదంతా ఏదో సినిమా ప్రమోషన్ కోసమని. అయితే, అదో వెబ్ సిరీస్ ప్రమోషన్. ఆ సిరీస్ పేరే ‘పరువు’. లేటెస్ట్గా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఆధ్యంతం ఆసక్తిగా సాగే ఈ వెబ్ సిరీస్‌ని ప్రమోట్ చేసే క్రమంలోనే నివేదా పేతురాజ్ ఆ పబ్లిసిటీ స్టంట్ చేసింది. ఓ డెడ్ బాడీని కారు ఢిక్కీలో పెట్టి నివేదా తన భర్తతో కలిసి కారులో డ్రైవ్ చేస్తుండగా, పోలీసులకు చిక్కబోయే సన్నివేశం ఈ సిరీస్‌లో వుంటుంది.
ఎలాగూ సిరీస్ ఇంట్రెస్టింగ్‌గానే వుంది కాబట్టి, నివేదా కష్టపడి చేసిన ప్రమోషన్ కూడా బాగానే వర్కవుట్ అయినట్లే.!
తాజా వార్తలు
- విజయవంతంగా ముగిసిన ఆల్కిఫా టోర్నమెంట్ నం.2026-123 గ్రాండ్ ఫైనల్
- అఫ్గానిస్థాన్‌లో భారీ భూకంపం..8 మంది మృతి
- సౌదీ అరేబియాలో అమరావతి విజయోత్సవ సభ
- మానవ అక్రమ రవాణా..మూడేళ్ల జైలుశిక్ష..!!
- ఇరాన్ డ్రోన్ దాడిలో దెబ్బతిన్న కువైట్ విద్యుత్ కేంద్రం..!!
- అల్ ఖబౌరాలో నీటమునిగి బాలుడు మృతి..!!
- 20 మిలియన్ దిర్హమ్ల గ్రాండ్ ప్రైజ్ గెలుచుకున్న భారతీయుడు..!!
- ఖతార్ లో పిల్లల భద్రతాకు మార్గదర్శకాలు జారీ..!!
- ఐఎమ్‌డి స్మార్ట్ సిటీ ఇండెక్స్‌లో 8 సౌదీ నగరాలు..!!
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!









