కన్నప్ప’కు ప్రబాస్ ఏ రేంజ్లో యూజ్ అవ్వనున్నాడో.!
- June 15, 2024
మంచు ఫ్యామిలీ డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కుతోన్న సినిమా ‘కన్నప్ప’. మితిమీరిన బడ్జెట్‌తో సొంత బ్యానర్‌పై ఈ సినిమాని ప్రెస్టీజియస్‌గా రూపొందిస్తున్నారు.
అలాగే, వివిధ భాషల నుంచి ప్రముఖ నటీ నటుల్ని కూడా దబ్బిడి దిబ్బిడిగా దించేస్తున్నారు. బాలీవుడ్ నుంచి బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ మొదలుకుని పలువురు ప్రముఖ నటీ నటులు ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే, తమిళ, కన్నడ పరిశ్రమల నుంచి కూడా. ఇక, టాలీవుడ్ నుంచి ప్రబాస్‌ని అలాగే నాగార్జున, నాని తదితరులు కూడా వున్నారని తెలుస్తోంది. వాళ్లందరి సంగతి అటుంచితే, తాజాగా ప్రబాస్ ఈ సినిమాలో నటిస్తున్నాడని ప్రూఫ్ అయితే బయటికొచ్చేసింది.
ఆల్రెడీ మంచు విష్ణు ఆ విషయం రివీల్ చేశాడు కూడా. జస్ట్ క్యామియో అన్నట్లుగా కాకుండా ఫుల్ లెంగ్త్‌లోనే ప్రబాస్ పాత్ర వుండబోతోందని విష్ణు చెప్పాడు. తాజాగా కేన్స్‌లో రిలీజ్ చేసిన టీజర్‌ని బట్టి ప్రబాస్ పాత్ర వున్నట్లే అర్ధమవుతోంది.
వెరీ లేటెస్ట్గా ప్రబాస్ పాత్ర మొత్తాన్నీ రివీల్ చేయకుండా ఆయన కళ్లు మాత్రమే కనిపించేలా వున్న కొన్ని ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయ్. నందీశ్వరుని పాత్రలో ప్రబాస్ కనిపించబోతున్నాడని ఇప్పటికే ప్రచారం జరిగింది. చూడాలి మరి, ముందు ముందు ఈ పాత్రకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ డీటెయిల్డ్‌గా చిత్ర యూనిట్ రివీల్ చేయనుందట.
తాజా వార్తలు
- బహ్రెయిన్-భారత్ సంబంధాల బలోపేతంపై ప్రశంసలు..!!
- త్వరలో యూనిఫైడ్ గల్ఫ్ టూరిస్ట్ వీసా..!!
- దుబాయ్‌లో టండూర్ టీనా రెస్టారెంట్ శాశ్వతంగా మూసివేత..!!
- OUN యాప్‌లో మున్సిపాలిటీ మంత్రిత్వ శాఖ 38 కొత్త సేవలు..!!
- మస్కట్‌లో సమావేశమైన ఒమన్-బ్రిటన్ వర్కింగ్ గ్రూప్స్..!!
- జహ్రాలో అనుమతి లేని గ్రోసెరీ స్టోర్ గుట్టురట్టు..!!
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ







