వయసుతో పాటు వచ్చే కంటి సమస్యల్ని నివారించుకోవాలంటే.!
- June 15, 2024
ఓ వయసుకొచ్చాకా కంటి చూపు సమస్యలు వేధిస్తుంటాయ్. అలాగే, ప్రస్తుతం మొబైల్ వాడకం గట్రా వయసుతో సంబంధం లేకుండానే అనేక రకాల కంటి సమస్యల్ని తెచ్చి పెడుతుంది. మరి, కంటి సమస్యలు దరి చేరకుండా వుండేందుకు కొన్ని రకాల డ్రై ఫ్రూట్స్ యూజ్ అవుతాయ్. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
బాదం ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతీరోజూ నానబెట్టిన బాదం గింజల్ని తీసుకుంటే, అనేక రకాల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందొచ్చు. అలాగే, వీటిలోని ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, ఫ్లెవనాయిడ్స్ కంటి చూపును మెరుగు పరిచేందుకు తోడ్పడతాయ్.
జీడీపప్పులోని ల్యూటిన్, గ్జియాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్లు రెజీనాని కాపాడి కంటి చూపును సురక్షితం చేస్తాయ్. పిప్తా మరియు కిస్మిస్లో విటమిన్ ఎ అధికంగా వుంటుంది. ఇది వయసు రీత్యా వచ్చే కంటి చూపు సమస్యల్ని దూరం చేస్తుంది.
ఖర్జూరాలు ఆరోగ్యానికి చాలా మంచివి. షుగర్ వున్నవాళ్లు కూడా నిర్భయంగా వీటిని తీసుకోవచ్చు. వీటిలోని విటమిన్ ఎ, ఇ, బి 6, ఫైబర్, మరియు ప్రొటీన్లు కంటి సంబంధిత సమస్యలు రాకుండా చేస్తాయ్.
డ్రై ఫ్రూట్స్‌లో మరో రకంగా చెప్పబడే ప్రూన్ పండ్లు కూడా రెగ్యులర్‌గా తినడం వల్ల కంటి చూపు మెరుగవుతుంది.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







