ఫాదర్స్ డే..!

- June 16, 2024 , by Maagulf
ఫాదర్స్ డే..!

ప్రపంచంలో తండ్రి ఇచ్చే భరోసా ఇంకెవరూ ఇవ్వలేరు. అమ్మ నవమాసాలు మోసి కని పెంచినా.. మీకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకునేది మాత్రం తండ్రే. ఆయన మీతో కఠినంగా ఉన్నా.. మీపై ఉండే ప్రేమ మాత్రం అనంతం అని చెప్పొచ్చు. మీ ప్రతీ అడుగులో.. మీ ప్రతి విషయంలో.. ఎంత వరకు ఎంతో స్వేచ్ఛ ఇవ్వాలో మీ నాన్నకు బాగా తెలుసు. తల్లి మందలించినా.. తండ్రి మాత్రం మీకు ఎప్పుడూ సపోర్ట్‌గానే నిలుస్తాడు.

అమ్మ ప్రేమను చూపించినట్లుగా.. నాన్న చూపించలేడు. కాస్త లేటుగా అయినా సరే.. మీకు కలలన్నీ నేరవేరుస్తాడు. మీకు ఏదైనా కావాలంటే నేరుగా కాకుండా అమ్మ ద్వారా అందిస్తాడు. మీ మీద ప్రేమను చూపిస్తే.. ఎక్కడ మీరు మాట వినకుండా పోతారని.. తాను కఠినంగా ఉన్నట్లు నటిస్తాడు. పిల్లల గెలుపును చూసి లోలోపలే ఆనందపడే వ్యక్తి నాన్న. నాన్న గొప్పతనాన్ని తెలుసుకోవడం కోసం ప్రతి ఏడాది ఫాదర్స్ డే వస్తుంది.  

నాన్న నిస్వార్థంగా పిల్లల విజయం కొరకు తపిస్తాడు. అతను చేసిన త్యాగాలు, మోసిన బాధ్యతల గురించి ఎన్ని చెప్పుకున్నా తక్కువే. నాన్నంటే ఒక చెట్టులాంటివాడు. తాను రాళ్ల దెబ్బలు తింటున్నా... పిల్లలకి తియ్యటి పండ్లు ఇచ్చే వ్యక్తి నాన్న. అలాంటి వ్యక్తి గొప్పతనాన్ని కచ్చితంగా అందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే.

--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి) 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com