తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది సంబరాలు

- June 18, 2024 , by Maagulf
తెలంగాణ గల్ఫ్ సమితి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ అవతరణ దశాబ్ది సంబరాలు

దోహా: దోహాలో గత శుక్రవారం జూన్ 14 వ తేదీన తెలంగాణ గల్ఫ్ సమితి కతర్ వారి ఆధ్వర్యంలో లోయల ఇంటర్నేషనల్ స్కూల్ లో సాయంత్రం 5 గంటల నుంచి కార్యక్రమాన్ని ప్రాంభించారు.ఈ కార్యక్రమానికి భారత రాయబారి విపుల్ ముఖ్యఅతిగా విచ్చేశారు. కాగా,జానపద సింగర్ లావణ్య,సింగర్ అరుణ్ పాల్గొని వచ్చిన తెలుగు ప్రజలందరినీ అలరించారు.మొదట కార్యక్రమాన్ని తెలంగాణ గల్ఫ్ సమితి అధ్యక్షుడు మైదం మధు ప్రారంభించి వచ్చిన అతిధులు ఆహ్వానం పలికారు, తెలంగాణ గల్ఫ్ సమితి ఫౌండర్ మెంబెర్ శంకర్ గౌడ్ తెలంగాణ గల్ఫ్ సమితి కతర్ లో చేస్తున్నసేవలను గుర్తు చేశారు,ఈ కార్యక్రమానికి అతిధులుగా విచ్చేసిన కోడూరి శివరామ ప్రసాద్ మరియు కృష్ణ కుమార్ తెలంగాణ గల్ఫ్ సమితి చేస్తున్న సేవలను అభినందించారు.

ముఖ్యఅతిధి విపుల్ మాట్లాడుతూ... తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లలో ఎంతో పోరోగతి సాధించిందని,మరియు గల్ఫ్ సమితి బృందం ఎల్లపుడు అందుబాటులో ఉంటూ కార్మికులకు ఒక ధైర్యాన్ని ఇస్తున్నందుకు కొనియాడారు. కార్యక్రమనికి ఐసీసీ అధ్యక్షుడు మణికంఠ,ఐసీబీఫ్ ఉపాధ్యక్షుడు దీపక్ షెట్టి, ఐసీసీ ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, ఐసీసీ జెనరల్ సెక్రెటరీ మోహన్ కుమార్, ఐసీసీ మహిళ విభాగం చైర్మన్ నందిని అబ్బాగౌని ,ఎస్.సి.బి.ఎఫ్ కార్యవర్గ సభ్యులు మొహమ్మద్ కుని జరీనా ఆహాద్ ,కుల్విందర్ సింగ్ ,అలాగే తోటి తెలుగు సంఘాల అధ్యక్షులు తెలంగాణ జాగృతి అధ్యక్షులు సుధా తెలంగాణ ప్రజా సమితి అధ్యక్షులు తిరుపతి ఆంధ్ర కళావేదిక అధ్యక్షులు వెంకప్ప తెలుగు కళా సమితి అధ్యక్షులు హరీష్ రెడ్డి ఆంధ్ర వెల్ఫేర్ అధ్యక్షులు నర్శింహ జోష్యుల  తెలుగు స్పోర్ట్స్ సెంటర్ అధ్యక్షులు అబ్బగోని శ్రీధర్ మరియు తెలుగు సంఘాల నాయకులు ప్రత్యేకంగా తెలంగాణ గల్ఫ్ కార్మికులు దాదాపుగా 2000 మంది పైగా పాల్గొనగా అలాగే దాదాపు 50 మంది సాంస్కృతిక కళాకారులు పాల్గొనగా తెలంగాణ గల్ఫ్ సమితి ప్రధాన కార్యదర్శి వంశీ ముగింపు సందేశాన్ని ఇవ్వగా, గల్ఫ్ సమితి కార్యవర్గ సభ్యులు గడ్డి రాజు,సంధ్య,ప్రియ,మనోహర్,సాగర్,గోలి శ్రీనివాస్,సుధాకర్,మారుతి,మరియు సలహాదారులు క్రిష్ణ ,ఎల్లన్న,వెంకటేష్ గత వారం రోజుల నుంచి కార్యక్రమాన్ని ముందుండి నడిపి విజయవంతం చేశారు.

--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి, ఖతార్)

Show Images

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com