టాలీవుడ్ చందమామ.. !
- June 19, 2024
కాజల్ అగర్వాల్ క్రేజ్ గురించి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్లాప్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత వరుస సక్సెస్‌లు చూసింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగింది. సీనియర్ అండ్ స్టార్ హీరోల నుంచి జూనియర్ హీరోలందరితోనూ నటించి ఆకట్టుకుంది. పెళ్లైన కూడా ఇంకా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. నేడు ఈ 'మిత్రవింద' పుట్టినరోజు సందర్భంగా ఆమె గురించి తెలుసుకుందాం.
1985లో జూన్ 19న పంజాబీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్న ముంబయిలో జన్మించింది కాజల్ అగర్వాల్. స్కూలింగ్ ముంబలోనే చేసింది. సెయింట్ ఆన్స్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసిందట. ఆ తర్వాత జై హింద్ కళాశాలలో ఇంటర్, అనంతరం మాస్ మీడియాలో గ్రాడ్యూవేషన్ చదివింది. ఆ తర్వాత ఎంబీఏ చదవాలని అనుకుంది. కానీ అనుకోకుండా ఇండస్ట్రీకి వచ్చింది.
బాలీవుడ్ చిత్రం క్యూన్ హో గయా నా(2004) చిత్రంతో అరంగేట్రం చేసిన కాజల్ అగర్వాల్ ఆ తర్వాత 2007లో 'లక్ష్మి కళ్యాణం'(2007) సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంలోనే తన యాక్టింగ్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ అనంతరం 'చందమామ'తో ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. మగధర, గణేష్, ఆర్య 2, డార్లింగ్, మిస్టర్ ఫర్ఫెక్ట్, దడ, బాద్‌షా, నాయక్, గొవిందుడు అందరివాడే లే ఇలా వరుసగా ఆఫర్స్ అందుకుంటూ తెలుగుతో పాటు తమిళంలోనూ స్టార్ హీరోయిన్గా ఎదిగింది.
ఇంగ్లీష్ మీడియా కథనాల ప్రకారం కాజల్ అగర్వాల్ నెట్ వర్త్ రూ.67 కోట్ల వరకు ఉండొచ్చట. మరి కొన్ని వెబ్సైట్లలో ఆమె దగ్గర ఉన్న ఆస్తులు రూ.90కోట్ల వరకు ఉండొచ్చని కూడా రాశారు. ఆమె ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.2 నుంచి రూ.4 కోట్ల వరకు తీసుకుంటోందని తెలుస్తోంది. ముంబయిలో రూ.6 కోట్ల విలువ గల లగ్జరీ బంగలా ఉందట. ఆమె దగ్గర ఖరీదైన విలాసవంతమైన కార్లు కూడా ఉన్నాయి. ఆడీ ఏ4, రేంజ్ రోవర్, స్కోడా అక్టావియా ఉన్నాయట. అలానే ఆమెకు బ్యూటీ ప్రొడక్ట్స్ కు సంబంధించిన కంపెనీ కూడా ఉందట. దాని ద్వారా ఈ ముద్దుగుమ్మ బానే సంపాదిస్తోందట.
కాజల్ వ్యక్తిగత జీవితానికి వస్తే లాక్‌డౌన్‌లో కాజల్ సైలెంట్‌గా ముంబైకి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లాడిన ఈ భామ 2022లో కొడుకు నీల్ కిచ్లూకి జన్మనిచ్చింది. ప్రెగ్నెన్సీ కారణం సినిమాలకు కాస్తా బ్రేక్ ఇచ్చిన కాజల్ బాలకృష్ణ భగవంత్ కేసరితో రీఎంట్రీ ఇచ్చింది.రీఎంట్రీలోనూ అదే జోరుతో వరుస సినిమాలు చేస్తూ ఉంది.
--డి.వి.అరవింద్(మాగల్ఫ్ ప్రతినిధి)
తాజా వార్తలు
- భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తత..
- సింహాచలం: మృతుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా ప్రకటించిన సీఎం చంద్రబాబు
- కోల్కతాలో విషాద ఘటన..14 మంది మృతి..
- దుబాయ్ అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్.. ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం..!!
- ప్రపంచ ఆరోగ్య సర్వే 2025 ను ప్రారంభించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ..!!
- తుమామా స్టేడియం దగ్గర ఇంటర్చేంజ్ మూసివేత..!!
- ITEX 2025.. ఒమన్ కు ప్రాతినిధ్యం వహించే వారి వివరాలు వెల్లడి..!!
- 16 నకిలీ సోషల్ మీడియా ఖాతాలు.. నిందితుడి అరెస్టు..!!
- 2025 మొదటి 3 నెలల్లో.. 42 మిలియన్ల దిర్హామ్లకు పైగా ఫేక్ వస్తువులు సీజ్..!!
- ఇండియన్ ఎయిర్ స్పేస్ బంద్!