శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో పెనుప్రమాదం తప్పింది
- June 20, 2024
హైదరాబాద్: శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. మలేషియన్ ఎయిర్ వేస్ విమానం శంషాబాద్ నుంచి కౌలలంపూర్ బయల్దేరింది. అయితే టేకాఫ్ అయిన 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలను గుర్తించి ల్యాండింగ్‌కు పైలెట్ అనుమతి కోరారు. అనుమతి వచ్చే వరకు కొద్దిసేపు గాల్లో విమానం చక్కర్లు కొట్టింది. చివరకు ఎమర్జేన్సీ ల్యాండింగ్‌కు ఏటీసీ అనుమతించింది.
ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ అయింది. ఘటన సమయంలో విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలిసింది. సేఫ్ ల్యాండింగ్‌తో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు. దాదాపు రెండు గంటలపాటు గాల్లోనే విమానం ఉంది. దీంతో ప్రయాణికులు కొంత ఆందోళనకు గురయ్యారు. నిన్న రాత్రి బయలుదేరాల్సిన విమానం సాంకేతిక సమస్య తలెత్తడంతో ప్రయాణికులు విమానాశ్రయంలో ఆందోళనకు దిగారు. తమను గమ్యస్థానానికి ఎప్పుడు చేరుస్తారో చెప్పాలంటూ అధికారులను నిలదీస్తున్నారు.
తాజా వార్తలు
- మైనర్ బాలికపై లైంగిక దాడి .. భారతీయుడికి ఏడేళ్లు జైలుశిక్ష
- ఖతార్ ఎయిర్వేస్ కు కొత్త సీఈఓ నియామకం..!!
- బీచ్‌లను క్లీన్ చేసిన కువైట్ డైవర్లు..!!
- సౌదీలో ఆరోగ్య సంరక్షణపై 95.7% మంది హ్యాపీ..!!
- ప్రైవసీ, డేటా ప్రొటెక్షన్ పై దృష్టి పెట్టండి..!!
- ఇండియా-ఒమన్ ఆర్థిక భాగస్వామ్యం..షురా కౌన్సిల్ సమీక్ష..!!
- హైదరాబాద్‌లో రోడ్లకు నూతన నామకరణం
- ఆఫ్‌లైన్ UPI: నెట్ అవసరం లేని చెల్లింపులు
- జేఈఈ అడ్వాన్స్డ్ 2026 పరీక్ష తేదీ ఇదే!
- అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్







