వాణిజ్య సంబంధాలపై చర్చించిన భారత రాయబారి

- June 21, 2024 , by Maagulf
వాణిజ్య సంబంధాలపై చర్చించిన  భారత రాయబారి

కువైట్: కువైట్‌లోని భారత రాయబారి డాక్టర్ ఆదర్శ్ స్వైకా.. కువైట్ ఆర్థిక మంత్రి మరియు ఆర్థిక వ్యవహారాలు, పెట్టుబడుల సహాయ మంత్రి డాక్టర్ అన్వర్ అల్-ముదాఫ్‌తో కీలక చర్చలు జరిపారు. ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. ఈ చర్చలో అక్రిడిటింగ్ బిల్లులు, భారతదేశంలోని స్థానిక కరెన్సీలలో వాణిజ్య లావాదేవీలకు చెల్లింపు,  ఇ-చెల్లింపులకు మారే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను కూడా ఈ చర్చలలో సమీక్షించారు. దేశంలోని భారతీయ కంపెనీలు ఎదుర్కొంటున్న అడ్డంకుల గురించి కూడా భారత రాయబారి చర్చించారని పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com