నకిలీ ఉత్పత్తుల విక్రయం.. 9 దుకాణాలు మూసివేత
- June 21, 2024
కువైట్: వాణిజ్యం మరియు పరిశ్రమల మంత్రిత్వ శాఖ వినియోగదారుల రక్షణ విభాగం చట్టపరమైన ఆడిట్‌కు లోబడి నకిలీ ఉత్పత్తులను విక్రయించినందుకు సాల్మియాలోని ఒక మాల్స్‌లోని తొమ్మిది వాణిజ్య దుకాణాలను మూసివేసింది. వస్తువులను సీజ్ చేయడంతో పాటు ఈ దుకాణాలకు బాధ్యత వహించే వారిని కమర్షియల్ ప్రాసిక్యూషన్‌కు సూచించినట్లు పేర్కొంది. నకిలీ వస్తువులతో వ్యాపారం చేసే వారిని నియంత్రించడంలో వాణిజ్య రక్షణ విభాగం కఠినంగా వ్యవహరించడం జరుగుతుందని హెచ్చరించారు. చట్టాలు మరియు నిబంధనలకు కట్టుబడి ఉండేలా మాల్స్ మరియు షాపుల పర్యవేక్షణ పర్యటనలను కొనసాగించాలని మంత్రిత్వ శాఖ సూచించింది. మోసాలను సహల్ యాప్ ద్వారా ఫిర్యాదు చేయాలని పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







