తెలుగు సినిమాపై మనసు పారేసుకున్న మరో బాలీవుడ్ హీరో.!
- June 21, 2024
బాలీవుడ్ నటీ నటులు తెలుగు సినిమాల్లో నటించేందుకు, తెలుగు టెక్నీషియన్లతో కలిసి పని చేసేందుకు తహతహలాడుతున్న సంగతి తెలిసిందే. అలాగే, బాలీవుడ్‌లో మన దర్శకులకు మంచి గౌరవ, అవకాశాలు దక్కుతున్న సంగతి కూడా తెలిసిందే.
ఇటీవలే రణ్‌బీర్ కపూర్ ‘యానిమల్’ సినిమా తెలుగులో మంచి విజయం అందుకుంది. తెలుగు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. సల్మాన్ ఖాన్, షారూఖ్ ఖాన్ వంటి స్టార్ హీరోలు సైతం తెలుగులో సినిమాలు చేసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు.
తాజాగా ఆ లిస్టులో చేరిపోయాడు బాబీ డియోల్ సోదరుడు సన్నీ డియోల్. గోపీచంద్ మలినేని తెరకెక్కించబోయే ఓ సినిమాలో సన్నీ డియోలో హీరోగా నటిస్తున్నాడు.
గోపీచంద్ మలినేని బాలయ్య కాంబినేషన్‌లో మొన్నా మధ్య ఓ సినిమా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. కానీ, రెగ్యులర్ షూట్ ఇంకా స్టార్ట్ కాలేదు. బాలయ్య రాజకీయాల్లో బిజీ అయిపోయిన కారణంగానో ఏమో, బాలీవుడ్ హీరో సన్నీ డియోల్‌తో సినిమా స్టార్ట్ చేశారు తాజాగా గోపీచంద్ మలినేని.
రీసెంట్‌గానే ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైంది. మైత్రీ మూవీస్, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తుండడం విశేషం.
తాజా వార్తలు
- 171 దేశాల పౌరులకు భారత్ ఈ-వీసా సౌకర్యం
- దూసుకొస్తోన్న 'భారత్ ట్యాక్సీ'
- ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం సినీ గానప్రస్థానానికి 60 ఏళ్లు
- గుంటూరులో NATS ఆధ్వర్యంలో జానపద సాంస్కృతిక సంబరాలు
- సాజిద్ అక్రమ్‌పై స్పష్టత ఇచ్చిన తెలంగాణ డీజీపీ
- భారత విమానాశ్రయాల్లో రూ.1 లక్ష కోట్లు పెట్టుబడి
- ఖతార్‌లో భారీగా తగ్గనున్న ఉష్ణోగ్రతలు..!!
- రియాద్‌లో 84% తక్కువ ధరకే రెసిడెన్సీ ప్లాట్ లు..!!
- రస్ అల్ ఖైమాలో భారత కార్మికుడు మృతి..!!
- కువైట్, భారత్ సంబంధాలు బలోపేతం..!!







