‘హనుమాన్’ ప్రొడ్యూసర్‌తో తేజు సినిమా.!

- June 21, 2024 , by Maagulf
‘హనుమాన్’ ప్రొడ్యూసర్‌తో తేజు సినిమా.!


భయంకరమైన యాక్సిడెంట్ తర్వాత కొన్ని నెలలు రెస్ట్ తీసుకుని ‘విరూపాక్ష’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్.

ఆ తర్వాత బ్యాక్ టు బ్యాక్ ‘బ్రో’ సినిమాతోనూ సూపర్ హిట్ కొట్టాడు. అటుపై కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ గ్యాప్‌లో కొన్ని కథలు విన్నాడట.

ఓ కొత్త దర్శకుడు తీసుకొచ్చిన స్టోరీ సాయి ధరమ్ తేజ్‌కి బాగా నచ్చిందట. వెంటనే ఈ ప్రాజెక్ట్‌కి కమిట్ అయ్యాడట. ఈ సినిమాకి ‘హనుమాన్’ సినిమాని నిర్మించిన నిరంజన్ రెడ్డి నిర్మించనున్నాడనీ తెలుస్తోంది.

కథా కమామిషు, ఆ కొత్త డైరెక్టర్ వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయ్. అలాగే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అప్డేట్ ఈ రోజు సాయంత్రం కన్‌ఫామ్ చేయనున్నారట.

అన్ని కలిసొచ్చి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యి మంచి హిట్టు కొడితే, అది తేజుకి హ్యాట్రిక్కే అవుతుంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com