అధునాతన సౌకర్యాలతో కొత్త రక్తదాన కేంద్రం
- June 23, 2024
దోహా: కొత్తగా స్థాపించబడిన ఖతార్ నేషనల్ బ్లడ్ డొనేషన్ సెంటర్ (QNBDC) వందలాది మంది దాతలకు ఒకేసారి సేవలు అందిస్తుంది. ఇందులో అధునాతన సౌకర్యాల ద్వారా రక్త సేకరణను చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేంద్రం పెద్ద ఎత్తున రక్తదానం ప్రచారాలను సులభతరం చేయడమే కాకుండా, దాతల సౌకర్యానికి ప్రాధాన్యతనిస్తుందన్నారు. "300 మంది దాతలకు ఒకేసారి వసతి కల్పించే సామర్థ్యం, 38 మంది దాతల నుండి ఒకేసారి రక్తాన్ని సేకరించే సామర్థ్యం కారణంగా QNBDC చాలా ప్రయోజనకరంగా ఉంది. దీనికి అదనంగా 12 పడకలతో ప్రత్యేక అఫెరిసిస్ సేకరణ గదిని ఏర్పాటు చేశారు." అని హమద్ మెడికల్ కార్పొరేషన్ (HMC) లాబొరేటరీ మెడిసిన్ మరియు పాథాలజీ విభాగం (DLMP) డాక్టర్ ఈనాస్ అల్ కువారి చెప్పారు. "ప్రతి రక్తదానం మా ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో అనేక మంది రోగులకు కీలకమైన జీవనాధారంగా పనిచేస్తుంది. రక్తదానం ద్వారా సేకరించిన బ్లడ్ కనీసం ముగ్గురు రోగులకు ప్రయోజనం చేకూరుస్తుంది. ”అని డాక్టర్ అల్ కువారి చెప్పారు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్
- పిల్లల ఇంటర్నెట్ వినియోగం పై సుప్రీంకోర్టు కీలక తీర్పు
- అబుదాబిలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
- పోలీస్ యూనిఫామ్‌లో డ్యాన్స్ చేస్తే కఠిన చర్యలు తప్పవు: డీజీపీ సీవీ ఆనంద్ వార్నింగ్
- ప్రముఖ సంగీత దర్శకుడు దేవా కన్నుమూత
- విమాన టికెట్ల ధరల నియంత్రణ పై కేంద్రం ఫోకస్
- తెలంగాణలో 5 రోప్‌వేలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్
- బహ్రెయిన్‌లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్‌లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!







