డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ కానున్న సినీ పెద్దలు
- June 23, 2024
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌తో సోమవారం మధ్యాహ్నం టాలీవుడ్ నిర్మాతలు సమావేశం కానున్నారు. విజయవాడ లోని క్యాంప్ ఆఫీసులో ఈ భేటీ జరుగుతుంది.
టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సహకరించాలని ఉప ముఖ్యమంత్రిని నిర్మాతలు కోరనున్నట్లు తెలుస్తోంది. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక వారు ఉప ముఖ్యమంత్రిని కలుస్తుండడం ఇదే తొలిసారి. సినిమా టిక్కెట్ల ధరలతో పాటు థియేటర్ల సమస్యలు వంటివి పవన్ తో చర్చించే అవకాశాలు ఉన్నాయి.
పవన్ ను అశ్వినీ దత్, హారిక హాసిని చినబాబుతో పాటు తెలుగు ఫిలిం ఛాంబర్ అధ్యక్షడు దిల్ రాజు, మైత్రి మూవీ మేకర్స్ నవీన్, రవిశంకర్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ, పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్, వివేక్, దామోదర్ ప్రసాద్, బోగవల్లి ప్రసాద్, డీవీవీ దానయ్య కలవనున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







