TG ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లు ఏర్పాటుకు శ్రీకారం
- June 23, 2024
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలు, గురుకుల విద్యాలయాలను అధునాతనంగా తీర్చిదిద్దడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ గురుకుల పాఠశాలలను వేర్వేరు చోట్ల కాకుండా ఒకేచోట ఇంటిగ్రేటేడ్ రెసిడెన్షియల్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌లను నిర్మించనున్నారు.పైలెట్ ప్రాజెక్టుగా కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ఈ క్యాంపస్‌ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్, ఉప ముఖ్యమంత్రి భట్టి , ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులతో నేడు సమీక్షించారు. ఇంటిగ్రేటేడ్ క్యాంపస్‌ల నిర్మాణానికి ఆర్కిటెక్ట్స్ రూపొందించిన పలు నమూనాలను పరిశీలించారు.
దాదాపు 20 నుంచి 25 ఎకరాల విస్తీర్ణంలోని ప్రాంగణంలో ఈ సమీకృత గురుకులాల సముదాయం ఏర్పాటు చేయనున్నారు. ఒకే చోట ఈ భవనాలు నిర్మించి మినీ ఎడ్యుకేషన్ హబ్‌గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా వార్తలు
- నేపాల్‌లో వరదలపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఒమన్..!!
- కువైట్‌లో భారీ డ్రగ్స్ రాకెట్ ఆపరేషన్ భగ్నం..!!
- లైసెన్స్ లేకుండా వన్యప్రాణుల వేట.. నలుగురు సౌదీ పౌరుల అరెస్ట్..!!
- అనుమతి లేని పెప్టైడ్ ఉత్పత్తులపై ఖతార్ నిషేధం..!!
- గల్ఫ్ సైబర్ భద్రతకు బహ్రెయిన్ నాయకత్వం..!!
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్‌లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్‌తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు







