ఉమెన్ సేఫ్టీ యాప్‌గా మారిన దిశ యాప్
- June 25, 2024
అమరావతి: మహిళల భద్రతకు జగన్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన దిశ యాప్ పేరును చంద్రబాబు ప్రభుత్వం ఉమెన్ సేఫ్టీ యాప్ గా మార్చింది.ఈ యాప్ ను గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్ లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.గత ప్రభుత్వం మహిళా రక్షణ పేరుతో.. మీ భద్రతే మా బాధ్యత అంటూ 2020 ఫిబ్రవరిలో దిశ యాప్ ను ప్రారంభించింది.దీనిని ఇప్పటి వరకు 50 లక్షల మంది డౌన్ లోడ్ చేసుకున్నారు.గతంలో యువతులు, మహిళల ఫోన్లలో ఈ యాప్ ని పోలీసులు డౌన్ లోడ్ చేయించారు.యువతులు, మహిళలు ఆపదలో ఉంటే ఈ యాప్ లోని ఫీచర్లు పోలీసులు, కుటుంబసభ్యులకు తక్షణమే సమాచారాన్ని అందిస్తాయి.దీనికి మరింత ప్రాచుర్యం కల్పించి మహిళలకు అండగా ఉండాలని టీడీపీ కూటమి ప్రభుత్వం భావిస్తోంది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







