dh30 బిలియన్లతో దుబాయ్‌లో రెయిన్ డ్రైనేజీ నెట్వర్క్
- June 25, 2024
దుబాయ్: దుబాయ్‌లో రెయిన్ డ్రైనేజీ నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేయడానికి 30 బిలియన్ దిర్హామ్‌ల వ్యయంతో ఒక ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్ ఆమోదించారు. యూఏఈ వైస్ ప్రెసిడెంట్ మరియు ప్రధాన మంత్రి, దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ ప్రకటించారు. 'తస్రీఫ్' అని పేరు పెట్టిన ఈ ప్రాజెక్ట్ దుబాయ్ లో వర్షపు నీటి పారుదల వ్యవస్థ సామర్థ్యాన్ని 700% పెంచుతుంది. 2033 నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని నిర్ణయించారు. ఇది రాబోయే వందేళ్లపాటు దుబాయ్‌కు సేవలందిస్తుందని షేక్ మహ్మద్ తెలిపారు. 'తస్రీఫ్' ఎక్స్పో దుబాయ్ ప్రాంతం, అల్ మక్తూమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ సిటీ మరియు జెబెల్ అలీని కవర్ చేస్తూ 2019లో దుబాయ్ ప్రారంభించిన డ్రైనేజీ ప్రాజెక్టుల కొనసాగింపుగా పనిచేయనుంది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







