ఏపీ సీఎస్ నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం పొడిగింపు..
- June 27, 2024
అమరావతి: ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (CS) నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీ కాలాన్ని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. ఆరు నెలల పాటు అంటే.. జూలై 1వ తేదీ నుంచి డిసెంబర్ 31వ తేదీ వరకు ఆయన సర్వీసును పొడిగిస్తూ డీఓపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం పంపించింది.
ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో చంద్రబాబు నాయుడు సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి వరకు సీఎస్ గా కొనసాగుతున్న జవహర్ రెడ్డిని బదిలీ చేసి నూతన సీఎస్ గా నీరభ్ కుమార్ ప్రసాద్ ను నియమించారు. నీరభ్ కుమార్ సీఎస్ గా బాధ్యతలు చేపట్టే సమయానికి మరో పది రోజులు మాత్రమే పదవీకాలం మిగిలి ఉంది. అంటే.. ఈనెల 30న ఆయన పదవీకాలం ముగియనుంది. దీంతో నీరభ్ సర్వీసును పొడిగించాలని కోరుతూ సీఎం చంద్రబాబు నాయుడు కేంద్రానికి లేఖ రాశారు. ఆరు నెలలు నీరభ్ పదవీకాలాన్ని పొడిగించాలంటూ లేఖలో పేర్కొన్నారు. ఏపీ సీఎం విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో నీరభ్ కుమార్ ప్రసాద్ పదవీకాలం ఆరు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
తాజా వార్తలు
- భారత్ టారిఫ్‌ల పై ట్రంప్‌కు అమెరికాలోనే వ్యతిరేకత
- ఏపీ: 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు
- భారత్ కు చేరుకున్న ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ
- గడువు ముగిసిన పదార్థాలు.. రెస్టారెంట్ యజమానికి జైలుశిక్ష..!!
- ఖతార్ లో కొత్త తరం వాహన లైసెన్స్ ప్లేట్లు..!!
- వాతావరణ ప్రమాదాలు, సునామీపై జాతీయ అవగాహన..!!
- పుట్టినరోజున ప్రమాదకరమైన స్టంట్..వ్యక్తి అరెస్టు..!!
- సౌదీ అరేబియా ప్రధాన నగరాల్లో ఎయిర్ టాక్సీ సేవలు..!!
- అల్-జౌన్, షేక్ జాబర్ కాజ్వే లో అగ్నిమాపక కేంద్రాలు..!!
- శంకర నేత్రాలయా ఫండ్‌రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం







