జీవితంలో రిస్క్ తీసుకోవాలి: అదనపు డీజీపీ మహేష్ భగవత్

- June 29, 2024 , by Maagulf
జీవితంలో రిస్క్ తీసుకోవాలి: అదనపు డీజీపీ మహేష్ భగవత్

హైదరాబాద్: జీవితంలో రిస్క్ తీసుకోవాలని అదనపు డీజీపీ మహేష్ భగవత్ యువతకు పిలుపునిచ్చారు.రిస్క్ తీసుకుని ప్రయత్నిస్తే విజేతలు అవుతారని, లేదంటే అనుభవజ్ఞులు అవుతారని సూచించారు.

రామకృష్ణ మఠంలో జరుగుతున్న 'శౌర్య' శిబిరాన్ని సందర్శించి ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. యూపీఎస్సీ విద్యార్థులకు ఇంటర్వ్యూని ఎదురుకునే విషయంలో ఉచిత శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. 2024లో 1016 మంది విద్యార్థులకు ఫ్రీ కోచింగ్ ఇవ్వగా 216 మంది క్వాలిఫై అయ్యారని, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన అనన్య ౩వ రాంక్ సాధించారని ఆయన తెలిపారు. ఇంటర్వ్యూ విషయంలో కోచింగ్ కోరుకునే పేద విద్యార్థులు 9440700105 వాట్సాప్ నెంబర్‌కు వివరాలు పంపాలని మహేష్ భగవత్ సూచించారు.

'శౌర్య' శిబిరంలోని విద్యార్థులకు ఆయన 'టైం మేనేజ్‌మెంట్‌', 'స్ట్రెస్ మేనేజ్‌మెంట్‌' పై సూచనలు చేశారు. కార్యక్రమంలో రామకృష్ణ మఠం అధ్యక్షులు స్వామి బోధమయానంద ప్రసంగిస్తూ సమాజానికి టెక్నాలజీతో పాటు శ్రేష్ఠులైన యువతీయువకుల అవసరం ఎంతైనా ఉందన్నారు. స్వామి వివేకానంద బోధనలు అనుసరిస్తూ జీవితాలను ఉద్ధరించుకోవాలని స్వామి బోధమయానంద పిలుపునిచ్చారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com