సౌదీ అరేబియా కొనసాగనున్న హీట్ వేవ్స్

- June 30, 2024 , by Maagulf
సౌదీ అరేబియా కొనసాగనున్న హీట్ వేవ్స్

రియాద్: ఈ వారం చివరి వరకు సౌదీ అరేబియా అంతటా ఉష్ణోగ్రతలు అధికంగానే నమోదు అవుతాయని జాతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. జూన్ 30 నుండి  జూలై 5  వరకు తూర్పు ప్రాంతం, రియాద్‌లోని కొన్ని ప్రాంతాలలో గరిష్ట ఉష్ణోగ్రతలు 46-49 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు 42-45 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకోవడంతో మక్కా,  అల్-మదీనాలోని కొన్ని ప్రాంతాలలో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయని పేర్కొన్నారు.  అల్-అహ్సా మరియు షరూరాలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 47 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు కాగా, దమ్మామ్ 46 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకుందని కేంద్రం శనివారం తెలిపింది. అల్-మదీనా, మినా మరియు వాడి అల్-దవాసిర్‌లలో 45 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com