ఖాజాన్ సెంట్రల్ వెజిటబుల్స్ & ఫ్రూట్స్ మార్కెట్ ప్రారంభం
- June 30, 2024
ఖాజాన్ సెంట్రల్ వెజిటబుల్స్ & ఫ్రూట్స్ మార్కెట్ ప్రారంభం
బర్కా: ఆహార భద్రత రంగంలో సౌత్ అల్ బతినా గవర్నరేట్‌లోని ఖాజాన్ ఎకనామిక్ సిటీ, విలాయత్ ఆఫ్ బర్కాలో అతిపెద్ద జాతీయ ప్రాజెక్టులలో భాగంగా సెంట్రల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్ ట్రయల్ ఆపరేషనల్ (కమిషనింగ్),వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. సెంట్రల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్ మార్కెటింగ్, దిగుమతి, కూరగాయలు, పండ్ల పునః-దిగుమతి మరియు కంపెనీలు, స్థానిక రైతుల స్థానిక వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెటింగ్ అవుట్‌లెట్ కోసం ఒక వేదికగా ఇది మారనుందని ఖాజాన్ ఎకనామిక్ సిటీ తెలిపింది. ఈ ప్రాజెక్ట్ SMEలకు వాణిజ్య అవకాశాలతో పాటు పౌరులకు ఉద్యోగావకాశాలు, పెట్టుబడి అవకాశాలను కల్పిస్తుందని ఆయన చెప్పారు. సెంట్రల్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మార్కెట్‌లో లాజిస్టిక్స్, ఫుడ్ సెక్టార్ కు సంబంధించిన సమగ్ర సౌకర్యాలు ఉన్నాయి. ప్రధానంగా హోల్‌సేల్ మార్కెట్, దుకాణాలు, కస్టమ్స్ తనిఖీ ప్లాట్‌ఫారమ్, ఫుడ్ సేఫ్టీ ల్యాబ్ మరియు ఇతర సౌకర్యాలతో పాటు స్థానిక ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







