బహ్రెయిన్ లో 26% పెరిగిన లేబర్ అథారిటీ తనిఖీలు
- June 30, 2024
మనామా: బహ్రెయిన్ లేబర్ మార్కెట్ రెగ్యులేటరీ అథారిటీ (LMRA) ఇటీవలే దాని త్రైమాసిక కార్యాచరణ నివేదికను విడుదల చేసింది. 2023 (జనవరి 1 నుండి జూన్ 20, 2024 వరకు) ఇదే కాలంతో పోలిస్తే అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖతో ఉమ్మడి తనిఖీ ప్రయత్నాలలో దాదాపు 26% పెరుగుదల నమోదైనట్టు సీఈఓ నిబ్రాస్ మొహమ్మద్ తాలిబ్ తెలిపారు. ఉమ్మడి ప్రచారాలు 306 నుండి 358కి పెరిగాయని,తనిఖీ సందర్శనలు సుమారు 20,000 నుండి 25,200కి పెరిగినట్టు వెల్లడించారు. కార్మికులకు సకాలంలో న్యాయమైన పరిహారం అందించడం లక్ష్యంగా ప్రైవేట్ రంగం సహకారంతో వేతన రక్షణ వ్యవస్థలో తాజా పరిణామాలపై ఆయన స్పందించారు. పని నాణ్యతను పెంపొందించడంపై దృష్టి సారించడంతోపాటు వ్యాపార యజమానుల కోసం విధానాలను క్రమబద్ధీకరించడానికి మరియు సేవలను మెరుగుపరచడానికి అనేక కార్యక్రమాలను తీసుకురానున్నట్లు వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







