గన్నవరం ఎయిర్‌పోర్ట్‌లో కార్గో సేవలు పునఃప్రారంభం..
- July 01, 2024
విజయవాడ: ఆంధ్రప్రదేశ్ గన్నవరం ఎయిర్‌పోర్టులో కార్గో సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. నేటి నుంచి సేవలు అందబాటులోకి వచ్చాయని.. అందరూ ఉపయోగించుకోవాలని విమానాశ్రయం అధికారులు తెలిపారు. రాబోయే అంతర్జాతీయ సర్వీస్ (కార్గో కోసం) నడిపేందుకు చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. వాస్తవానికి 2021లోనే కార్గో సేవలు ప్రారంభంకావాల్సి ఉండగా.. కోవిడ్ కారణంగా వాయిదా పడింది. మళ్లీ ఇప్పటికి సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి.
గన్నవరం ఎయిర్ పోర్టులో ఒమేగా కంపెనీ కార్గో సర్వీసును పునరుద్ధరించడం అభినందనీయం అని గన్నవరం ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత రెడ్డి అన్నారు. కార్గో సర్వీస్ తో గన్నవరం చుట్టుపక్కల ప్రాంతాల రైతులకు ఉపయోగకరంగా ఉంటుందని చెప్పారు. గన్నవరం విమానాశ్రయం నుంచి విమాన సర్వీసులు గణనీయంగా పెరిగాయని.. అందుకు అనుగుణంగా కార్గో సర్వీస్ ప్రారంభించడం శుభసూచికమన్నారు.
తాజా వార్తలు
- దుబాయ్ లో స్కూల్ బస్ పూలింగ్
- ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ సంబరాలు
- ప్రమాదకర స్టూడెంట్ ఛాలెంజ్ల పై తల్లిదండ్రులకు DHA హెచ్చరిక
- శబరిమలలో మకర జ్యోతి దర్శనం..పరవశించిన అయ్యప్ప భక్తులు
- తిరుపతి: ప్రజల ఆరోగ్యానికి స్విమ్స్ ప్రత్యేక హెల్త్ చెకప్ ప్యాకేజీలు
- ఏపీ: రాష్ట్రానికి రూ.567 కోట్లు నిధులు విడుదల చేసిన కేంద్రం
- సౌదీ అరేబియాలో ఘనంగా SATA ER సంక్రాంతి సంబరాలు–2026
- ఆన్లైన్ షాపింగ్ సులభం చేసే కొత్త ఫీచర్
- డిజిపి చేతుల మీదుగా ‘కాల్ ఫర్ బ్లడ్’ వెబ్ యాప్ ప్రారంభం
- చైనాలో ఒంటరిగా ఉండేవారిని కాపాడే యాప్







