యూఏఈలో డ్రైవింగ్ స్కూల్స్ కొత్త దందా?
- July 02, 2024
యూఏఈ: యూఏఈ నివాసి మహా ఎల్ తన డ్రైవింగ్ పరీక్షలో వరుసగా తొమ్మిది సార్లు ఫెయిలయ్యారు. ఎమిరేట్‌లోని వేరే డ్రైవింగ్ స్కూల్‌కు మారారు. అక్కడ ఆమె మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణత సాధించింది. "నేను ప్రతిదీ సరిగ్గా చేసినప్పటికీ, మొదటి పాఠశాలలో నన్ను ఉద్దేశపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నట్లు అనిపించింది. నేను అక్కడ తొమ్మిది సార్లు ఎలా విఫలమయ్యానో నాకు అర్థం కాలేదు. కానీ నా మొదటి ప్రయత్నంలోనే మరొక డ్రైవింగ్ స్కూళ్లో చాలా సులభంగా ఉత్తీర్ణత సాధించాను." ఆమె చెప్పింది. కొన్ని డ్రైవింగ్ పాఠశాలలు ఉద్దేశపూర్వకంగా విద్యార్థుల నుండి ఎక్కువ డబ్బును సేకరించేందుకు ఇలా తమ స్టూడెంట్స్ ను ఉద్దేపూర్వకంగా ఫెయిల్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో పుకార్లు హల్చల్ చేస్తున్నాయి. ఈ ప్రక్రియతో విసుగు చెందిన కొందరు విద్యార్థులు తమ ఆందోళనలను వినిపించి పాఠశాలలు మారారు. కానీ డ్రైవింగ్ స్కూల్స్ మాత్రం వీటిని ఖండిస్తున్నారు.
దుబాయ్‌కి చెందిన లెబనీస్ ప్రవాస బిలాల్ యాసిర్ తన పరీక్షలో ఆరుసార్లు ఫెయిల్ అయ్యాడు. దీని తర్వాత, అతను తన డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌ని మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు. "కొన్ని డ్రైవింగ్ పాఠశాలలు ఎగ్జామినర్‌లతో మెరుగైన సంబంధాలను కలిగి ఉన్నాయని, ఫలితాలను ప్రభావితం చేయగలవని నేను భావిస్తున్నాను. అయితే ఇతరులు వారి విద్యార్థులపై కఠినంగా ఉంటారు." అని యాసర్ తెలిపారు. కేవలం 10 నిమిషాలు మాత్రమే జరిగే స్ట్రీట్ ఎగ్జామ్‌లో ఎవరైనా సురక్షితమైన, సమర్థుడైన డ్రైవర్ కాదా అనేది ఖచ్చితంగా నిర్ధారించడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది ఒక వ్యక్తి నైపుణ్యాలపై కాకుండా డ్రైవింగ్ పాఠశాలల ఇష్టాలపై ఆధారపడి ఉంటుందని పలువురు స్టూడెంట్స్ తమ సోషల్ మీడియా అకౌంట్లలో వాపోయారు. కాగా, డ్రైవింగ్ పాఠశాలలు ఆర్థిక ప్రయోజనాల కోసం లెర్నింగ్ ప్రక్రియను పొడిగిస్తాయనే అభిప్రాయం ఒక అపోహ అని గలదరి మోటార్ డ్రైవింగ్ సెంటర్‌లో మార్కెటింగ్ హెడ్ సమీర్ అఘా కొట్టిపారేశారు. అయితే, యూఏఈలో డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి, పౌరులు మరియు ప్రవాసులు తప్పనిసరిగా ఎమిరేట్స్‌లో ఒక రిజిస్టర్డ్ డ్రైవింగ్ ఇన్‌స్టిట్యూట్‌కి దరఖాస్తు చేసుకోవాలి. ముందస్తు డ్రైవింగ్ అనుభవం లేని వ్యక్తులు తప్పనిసరిగా ఇన్‌స్టిట్యూట్ అందించిన 40 గంటల డ్రైవింగ్ కోర్సులను పూర్తి చేయాలి. డ్రైవింగ్ సంస్థలలో విద్యార్థులు యూఏఈ ట్రాఫిక్ విభాగం సెట్ చేసే వివిధ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి.
తాజా వార్తలు
- ఏపీ: పోర్టుల అభివృద్ధికి కీలక చర్యలు
- ఫ్రాన్స్ నుంచి 114 రాఫెల్ జెట్లను కుదుర్చుకున్న భారత్
- ఇరాన్ నుంచి స్వదేశానికి చేరుకున్న భారతీయులు
- స్కూల్ పిక్నిక్లో స్టేల్ ఫుడ్.. పేరెంట్స్ ఫైర్..!!
- ప్రైజ్ అవార్డులపై కువైట్ సెంట్రల్ బ్యాంక్ కీలక నిర్ణయం..!!
- ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన కింగ్ సల్మాన్..!!
- ఆరాద్లోని మినీ హెరిటేజ్ విలేజ్‌లో అగ్నిప్రమాదం..!!
- వైరల్ ఛాలెంజ్ లపై దుబాయ్ పోలీసుల వార్నింగ్..!!
- 2026లోనూ ఖతార్ టూరిజం దూకుడు..!!
- కేఏ పాల్‌కు అమెరికాలో అరుదైన గౌరవం..







