ఏపీ సీఎం చంద్రబాబు దూకుడు..రెండో శ్వేతపత్రం సిద్ధం
- July 02, 2024
అమరావతి: అమరావతి తాజా పరిస్థితి, భవిష్యత్ కార్యాచరణపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు శ్వేతపత్రం విడుదల చేయనున్నారు. నిన్న సచివాలయంలో పురపాలక శాఖ మంత్రి నారాయణ, ఆ శాఖ ఉన్నతాధికారులతో పాటు సీఆర్డీఏ కమిషనర్ తో ముఖ్యమంత్రి సమీక్షించారు. శ్వేతపత్రంలో పొందుపరచాల్సిన అంశాలపై కొన్ని సూచనలు చేశారు. కీలకమైన శాఖలు, ప్రాజెక్టులపై రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో ఇది రెండోది.
పోలవరం ప్రాజెక్ట్ పై ఇప్పటికే మొదటి శ్వేతపత్రం విడుదల చేసింది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక తొలుత పోలవరం ప్రాజెక్ట్ ను సందర్శించిన చంద్రబాబు ఆ తర్వాత రాజధానిలోనూ విస్తృతంగా పర్యటించారు. రాజధాని పనులను మళ్లీ పట్టాలెక్కించేందుకు చేపట్టాల్సిన చర్యలపై కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు.
రాజధాని అమరావతి నిర్మాణం పూర్తి చేసేందుకు చంద్రబాబు నడుం కట్టారు. ఇప్పటికే నిర్మాణ పనులను పరిశీలించారు. రాజధాని నిర్మాణ పనులు ఏ స్థాయిలో ఉన్నాయి అనే దానికి సంబంధించి పూర్తి నివేదికను తెప్పించుకునే పనిలో చంద్రబాబు ఉన్నారు. ఈ నేపథ్యంలో రెండో శ్వేతపత్రంగా రాజధాని అమరావతి నిర్మాణానికి సంబంధించి విడుదల చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. నిన్న దీనికి సంబంధించి అధికారులతో రివ్యూ చేశారు. ఇప్పటివరకు జరిగిన పనులకు సంబంధించి వ్యవహారాలను శ్వేతపత్రంలో పొందుపరిచారు. గతంలో జరిగిన నిర్మాణాలు, పెండింగ్ లో ఉన్న పనులు, ఏయే పనులు ప్రధానంగా డ్యామేజ్ అయ్యాయి.. ఇలాంటి అంశాలను వైట్ పేపర్ లో పొందుపరిచినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు
- 1,750 కుటుంబాలకు QR34 మిలియన్లు పంపిణీ..!!
- వారంలో రోజుల్లో 12,098 మందిపై బహిష్కరణ..!!
- ఆ మూడు ఎయిర్ లైన్సుల్లో బ్లూటూత్ ఇయర్ఫోన్లపై నిషేధం..!!
- కువైట్ ఉప ప్రధానమంత్రితో కేరళ ముఖ్యమంత్రి భేటీ..!!
- మాదకద్రవ్యాల కన్సైన్మెంట్ తో పట్టుబడ్డ ముగ్గురు ఆసియన్లు..!!
- బహ్రెయిన్ భూ విస్తీర్ణం 787.79 కి.మీ²కు విస్తరణ..!!
- డిజిటల్ బంగారం పై సెబీ హెచ్చరిక
- దుబాయ్ లో వీసా పునరుద్ధరణను ట్రాఫిక్ జరిమానాకు లింక్..!!
- 2027 అరబ్ క్రీడలకు బహ్రెయిన్ ఆతిథ్యం..!!
- అవినీతికి వ్యతిరేకం..మానవ హక్కులకు కువైట్ మద్దతు..!!







