మారుతి పంట పండిందిగా.!
- July 03, 2024
మినిమమ్ బడ్జెట్ సినిమాలు తెరకెక్కించే దర్శకుడు మారుతి, యూనివర్సల్ హీరో అయిన ప్రబాస్‌ని ఎలా ఒప్పించాడో తెలీదు కానీ, తనతో ఓ సినిమాకి ఓకే చేయించాడు.
చాలా కాలమే అయ్యింది ఈ ప్రాజెక్ట్ సెట్ అయ్యి. ఆల్రెడీ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. ‘రాజా సాబ్’ అని ఈ సినిమాకి టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. అయితే, ఎంత యూనివర్సల్ స్టార్‌ని తీసుకున్నప్పటికీ మారుతి పెద్ద బడ్జెట్ పెట్టుకోకుండా మినిమమ్ బడ్జెట్‌లోనే హై క్వాలిటీస్‌తో ప్రబాస్ రేంజ్‌కి ఎంతమాత్రమూ తగ్గకుండా ‘రాజా సాబ్’ని తెరకెక్కిస్తున్నాడు.
హారర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా వుండబోతోందని ప్రచారమైతే వుంది. వింటేజ్ లుక్స్‌లో ప్రబాస్‌ని చూపించబోతున్నానని మారుతి చెబుతున్నాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు హీరోయిన్లు ఈ సినిమాలో ప్రబాస్‌తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయబోతున్నారు.
మాళవిక మోహనన్ లీడ్ హీరోయిన్ కాగా, నిధి అగర్వాల్, రిధి కుమార్ సెకండ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇంపార్టెంట్ రోల్ పోషిస్తున్నాడు. అసలు మ్యాటర్ ఏంటంటే, ‘కల్కి’ విజయంతో మారుతికి మరింత కాన్ఫిడెన్స్ వచ్చేసిందట.
ఎలాగూ లో బడ్జెట్ మూవీనే.. సో కంటెంట్ విషయంలో ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లే కలెక్షన్లు. ఇంకేముంది మారుతి పంట పండినట్లేగా.! అన్నట్లు వచ్చే ఏడాది సంక్రాంతి టార్గెట్‌గా ఈ సినిమాని రూపొందిస్తున్నారు.
తాజా వార్తలు
- ఒమన్‌లో దొంగతనం ఆరోపణలపై వ్యక్తి అరెస్టు..!!
- గ్లోబల్ విలేజ్ సీజన్ 30 డేట్స్ అనౌన్స్..!!
- బ్యాంకులలో త్వరలో ఫ్రైజ్ డ్రాలు..!!
- దోహాలో అత్యవసరంగా అరబ్-ఇస్లామిక్ సమ్మిట్..!!
- ఫేక్ ప్లాట్‌ఫారమ్‌లతో నేరాలు..ముగ్గురు సిరియన్లు అరెస్టు..!!
- క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ పుట్టినరోజు వేడుకల్లో చాముండేశ్వరనాథ్
- కేంద్రం కొత్త ఆర్థిక మార్పులు, ఉత్పత్తి ధరల ప్రభావం
- నేడు భారత్- పాకిస్తాన్, హై వోల్టేజ్ మ్యాచ్!
- భారత్-పాకిస్తాన్ మ్యాచ్: నిషేధిత వస్తువుల జాబితా..!!
- న్యూయార్క్ డిక్లరేషన్ ను స్వాగతించిన ఒమన్..!!