శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పు.. టీటీడీ క్లారిటీ
- July 03, 2024
తిరుమల శ్రీవారికి నివేదించే అన్న ప్రసాదాల తయారీలో మార్పులంటూ కొంత కాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంపై తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్పందించింది.
ఇదంతా తప్పుడు ప్రచారం అని టీటీడీ అధికారులు క్లారిటీ ఇచ్చారు. తిరుమల శ్రీవారికి నివేదించే ప్రసాదంలో సేంద్రియ బియ్యం వాడకాన్ని నిలిపివేసి.. గతంలో వినియోగించే బియ్యాన్ని వాడాలని టీటీడీ నిర్ణయించినట్లు సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతోందని.. అది పూర్తిగా అసత్యమని అధికారులు స్పష్టం చేశారు.
ఇటీవల అర్చకులు, ఆలయ అధికారులతో ఈవో శ్యామలరావు నిర్వహించిన సమావేశంలో స్వామి వారికి నివేదించే అన్నప్రసాదాలు, వాటి దిట్టం గురించి సుదీర్ఘంగా చర్చించారని అధికారులు వెల్లడించారు . అయితే దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తేల్చి చెప్పారు. కానీ.. అన్న ప్రసాదాల తయారీలో మార్పులు చేసినట్లు కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇలాంటి తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని భక్తులకు టీటీడీ అధికారులు సూచించారు.
తాజా వార్తలు
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!







