ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ
- July 04, 2024
న్యూ ఢిల్లీ: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోడీతో ఆయన సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థికసాయం, ఇతర అంశాలపై ప్రధానితో చంద్రబాబు చర్చించారు. దాదాపు అరగంట పాటు సాగిన ఈ సమావేశంలో చంద్రబాబు డిమాండ్లపై ప్రధాని సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.అంతకుముందు కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌తో సమావేశమైన సీఎం చంద్రబాబు.. వివిధ అంశాలపై మాట్లాడారు.
ఇక మధ్యాహ్నం కేంద్రమంత్రులు అమిత్‌షా, నితిన్ గడ్కరీ, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో సీఎం చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు. ఇక సాయంత్రం కేంద్రమంత్రులు మనోహర్ లాల్ ఖట్టర్, హర్దీప్ సింగ్ పురీతో భేటీ కానున్నారు. చంద్రబాబుతో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, భూపతి రాజు శ్రీనివాస్ వర్మ.. రాష్ట్ర మంత్రులు పయ్యావుల కేశవ్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ నీరబ్ కుమార్, ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
తాజా వార్తలు
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!
- మస్కట్‌లో వెల్లివిరిసిన భారత గణతంత్ర స్ఫూర్తి..!!
- బహ్రెయిన్ తేవర్ పెరవై ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం..!!
- బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ లో ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
- శుభాంశు శుక్లాకు అశోక చక్ర ప్రదానం చేసిన రాష్ట్రపతి







