రూ.5వేలతో పుష్పక్ ఏసీ జనరల్ బస్‌పాస్
- July 04, 2024
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీ శంషాబాద్ విమానాశ్రయానికి నిత్యం రాకపోకలు సాగించే ప్రయాణికుల సౌకర్యార్థం ‘పుష్పక్ ఏసీ జనరల్ బస్‌పాస్’ను ప్రవేశపెట్టింది. దీని ధర రూ.5 వేలు. ఈ పాస్‌తో ఏ బస్సులోనైనా, సిటీలో ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. పుష్పక్ పాస్‌తోపాటు శంషాబాద్, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్‌రోడ్స్, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి విమానాశ్రయానికి రూట్‌పాస్, గ్రీన్ మెట్రో గ్రేటర్‌జోన్‌లోని ప్రయాణికుల కోసం మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో రూ.1900తో నెలవారీ పాస్‌ను తీసుకొచ్చింది.
ఇది సికింద్రాబాద్-పటాన్‌చెరు (219), బాచుపల్లి-వేవ్‌రాక్ వయా జేఎన్టీయూ (195), కోఠి-కొండాపూర్ (127కే) మార్గాల్లో చెల్లుబాటు అవుతుంది. రూట్‌పాస్ ధరలను రూ. 2 వేల నుంచి రూ. 4 వేలుగా నిర్ణయించింది. శంషాబాద్ నుంచి రూ. 2 వేలు, ఆరాంఘర్, బాలాపూర్ క్రాస్‌రోడ్ నుంచి రూ. 3 వేలు, ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి రూ. 4 వేలుగా పాస్ ధరలను నిర్ణయించింది.
తాజా వార్తలు
- చిరు వ్యాపారులకు కేంద్ర ప్రభుత్వ శుభవార్త
- తెలంగాణ ప్రభుత్వం ఇన్ని ఉద్యోగాలు ఇచ్చింది: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
- తెలంగాణ: గణతంత్ర దినోత్సవం..తెలంగాణకు 23 పోలీస్ పతకాలు
- మంగళవారం బ్యాంక్ ఉద్యోగుల బంద్
- గణతంత్ర దినోత్సవం సందర్భంగా లోక్ భవన్లో జరిగిన తేనీటి విందు
- ఖతార్‌లో ఇండియా ఉత్సవ్.. గణతంత్ర దినోత్సవ వేడుకలు..!!
- భారత దేశవ్యాప్తంగా ఘనంగా గణతంత్ర వేడుకలు..
- కింగ్ ఖలీద్ ఎయిర్ పోర్టు టెర్మినల్ 2 ప్రారంభం..!!
- దుబాయ్‌లో ఘనంగా రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్..!!
- కువైట్ లో మరో బేబీ ఫార్ములా ఉపసంహరణ..!!







