టీం ఇండియాతో మార్మోగిన వాంఖడే స్టేడియం..
- July 04, 2024
ముంబై: టీ20 ప్రపంచకప్ 2024 ట్రోఫీతో భారత్ కి చేరుకున్న టీమిండియా ఆటగాళ్లను ముంబైలోని వాంఖడే స్టేడియంలో సన్మానించేందుకు బీసీసీఐ ఘనంగా ఏర్పాట్లు చేసింది. మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. అనంతరం టీమిండియా ఆటగాళ్లు వాంఖడే మైదానానికి చేరుకోగానే హర్షధ్వానాలతో స్టేడియం మార్మోగింది. ఆటగాళ్లు జాతీయ జెండాలు చేతబూని స్టేడియమంతా కలియతిరిగారు. బాలీవుడ్ పాటలకు స్టెప్పులు వేసి అభిమానుల్లో జోష్ నింపారు.
అనంతరం వాంఖడే స్టేడియంలో భారత ఆటగాళ్లు ప్రపంచకప్ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ట్రోఫీ గెలుపులో కీలకపాత్ర పోషించిన హార్దిక్ పాండ్యాకు రోహిత్ శర్మ, రాహుల్ ద్రవిడ్, పేసర్ బుమ్రా అభినందనలు తెలిపారు.ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ, కార్యదర్శి జై షా, ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా రూ.125 కోట్ల ప్రైజ్ మనీ చెక్కును టీమిండియా క్రికెటర్లకు అందించారు.వాంఖడే స్టేడియంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి అభిమానులకు ఉచిత ప్రవేశం కల్పించారు.దీంతో స్టేడియంలోని స్టాండ్స్ అన్నీ ఫ్యాన్స్‌తో కిక్కిరిసిపోయాయి.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







