కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు సమావేశం
- July 05, 2024
న్యూఢిల్లీ: ఏపి సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన కొనసాగుతుంది. ఈ పర్యటనలో ఆయన వరుస భేటీలతో బిజీగా ఉన్నారు. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్‌తో చంద్రబాబు సమావేశమయ్యారు. సీఎంతో పాటు కేంద్రమంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, ఏపీ ఆర్ధికమంత్రి పయ్యావుల కేశవ్, ఎన్డీఏ ఎంపీలు కేంద్రమంత్రితో భేటీ అయ్యారు.
కేంద్ర బడ్జెట్లో ఏపీ అంశాలకు ప్రాధాన్యతనిస్తూ నిధుల కేటాయింపు చేయాలని ఆర్ధికమంత్రిని చంద్రబాబు కోరారు. కేంద్ర ప్రభుత్వం చేయూతనిచ్చి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాన్ని ఆదుకోవాలన్నారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌తో భేటీ అనంతరం కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాతో ఆయన సమావేశం కానున్నారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు.. ఆకస్మిక వరదలు..!!
- యూఏఈలో వాతావరణ మార్పులు.. విమాన సర్వీసులకు అంతరాయం..!
- బహ్రెయిన్‌లో డెలివరీ బైక్‌ల కొత్త లైసెన్సులపై నిషేధం?
- ఖతార్‌లో 25 ఆరోగ్య కేంద్రాల ద్వారా హోమ్ వైద్య సేవలు..!!
- కువైట్‌లో నేచర్ రిజర్వ్ లో హంట్.. ఇద్దరు అరెస్ట్..!!
- ఒమన్‌లో ఎల్‌నినో ఎఫెక్ట్.. భారీ వర్షాలు, వరదలు..!
- క్యాన్సర్ రోగులకు గుడ్ న్యూస్ తెలిపిన సిటిజెన్స్ హాస్పిటల్
- రష్యా సంబంధిత ఆంక్షలు, సుంకాల అమలుపై ట్రంప్ తాత్కాలిక మినహాయింపు
- బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం..10 మంది సజీవ దహనం
- బ్రెయిన్ క్యాన్సర్‌తో పోరాడుతున్న బాలుడికి అండగా నిలిచిన కేటీఆర్







