నిబంధనల ఉల్లంఘనకు సిసిటివితో చెక్
- June 13, 2016
సరికొత్త సిసిటివి ట్రాఫిక్ మానిటరింగ్ సిస్టమ్‌కి అధికారుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ కొత్త సిస్టమ్ ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల్ని గుర్తించడానికి వీలవుతుందని, అలాగే ప్రమాదాల్ని తగ్గించడంతోపాటు ట్రాఫిక్ని నియంత్రించడం జరుగుతోందని అధికారులు తెలిపారు. జనరల్ డైరెక్టరేట్ ఆఫ్ ట్రాఫిక్ - ట్రాఫిక్ కల్చర్ డైరెక్టర్ లెఫ్టినెంట్ కల్నల్ ఒసామా బహర్ మాట్లాడుతూ, ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆర్డినరీ సీసీటివి కెమెరాలతో పోల్చితే తాజా టెక్నాలజీ ఎంతో సమర్థవంతంగా పనిచేస్తుందని చెప్పారు. కొత్త విధానం ద్వారా ముందే ట్రాఫిక్ని అంచనా వేయడానికి వీలువుతుందని తెలిపారాయన. కొత్త టెక్నాలజీతో వాహనాల వేగాన్ని గుర్తించడం, అలాగే రోడ్లపై ట్రాఫిక్ని అంచనా వేయడం, సిగ్నల్ క్రాసింగ్, రాంగ్ ఓవర్‌టేకింగ్, ఎల్లో బాక్స్, ఎమర్జన్సీ లేన్స్‌లో డ్రైవింగ్, మొబైల్ ఫోన్ వాడుతూ వాహనాలు నడపడం వంటి ఉల్లంఘనల్ని గుర్తించవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- టీఆర్ఎస్ చీఫ్ కవితతో బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ భేటీ
- అబూధాబి BAPS హిందూ మందిరానికి ప్రతిష్ఠాత్మక ‘టాలరెన్స్ అవార్డు 2026’
- తెలంగాణ రోడ్లకు రూ.7,597 కోట్లు విడుదల చేసిన కేంద్రం
- కర్ణాటక సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన డీకే శివకుమార్
- ప్రజల విశ్వాసమే పోలీసింగ్‌కు పునాది: సైబరాబాద్ సీపీ డా.ఎం.రమేష్
- ఇరాన్ దాడి అనంతరం కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని సందర్శించిన ప్రధాని షేక్ అహ్మద్
- క్షిపణుల అడ్డుకట్ట దృశ్యాలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వ్యక్తి అరెస్ట్
- క్షతగాత్రులను పరామర్శించిన కువైట్ రక్షణ మంత్రి షేఖ్ అబ్దుల్లా అలీ
- హిజ్రీ నూతన సంవత్సరానికి యూఏఈలో జూన్ 15న సెలవు









