ఈ సారి బిగ్‌బాస్.! నాగార్జున డబుల్ ధమాకా.!
- July 05, 2024
ప్రతీ ఏడాదీ బిగ్‌బాస్ సీజన్, నాగార్జునకి పండగే అని చెప్పొచ్చు. సరిగ్గా అదే టైమ్‌కి ఆయన ఓ మల్టీ స్టారర్ సినిమాని కూడా లైన్లో వుంచుకుంటూ వస్తున్నారు గత రెండు సీజన్లుగా.
ఈ ఏడాది కూడా అదే సాంప్రదాయాన్ని కొనసాగించారు. ఈ సారి భారీ మల్టీ స్టారరే లైన్లో పెట్టేశారాయన. అదే ‘కుబేర’. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది.
నాగార్జునతో పాటూ, తమిళ స్టార్ హీరో ధనుష్ ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. రష్మిక మండన్నా హీరోయిన్గా నటిస్తోంది. గతంలో నాగార్జున, నాని, రష్మిక మండన్నా కాంబినేషన్లో వచ్చిన ‘దేవదాస్’ సినిమా మంచి హిట్ అయ్యింది.
ఈ సారి శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న ‘కుబేర’ సినిమాపై మంచి అంచనాలున్నాయ్. అలాగే ‘బిగ్‌బాస్’ టైమ్‌లో ఈ సినిమాని నాగార్జున తనదైన స్థాయిలో ప్రమోట్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు కూడా. చూడాలి మరి, ఓ వైపు బిగ్‌బాస్, ఇంకోవైపు ‘కుబేర’ నాగ్ని బాక్సాఫీస్ కుబేరుడ్ని చేస్తుందేమో.!
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







