ఓజీ మీద క్లారిటీ ఇచ్చేసిన పవన్ కళ్యాణ్.!
- July 05, 2024
ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీగా వున్నారు పవన్ కళ్యాణ్. కాదు కాదు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఈ టైమ్‌లో సినిమాలంటే కష్టమేగా.! కానీ, కొద్దిగా టైమ్ తీసుకుంటాననీ, ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేస్తానని నిర్మాతలకి మాటిచ్చానని తాజాగా పవన్ కళ్యాణ్ తెలిపారు.
అయితే, మిగిలిన సినిమాలెలా వున్నా.. ‘ఓజీ’పై ఆయన క్లారిటీ ఇచ్చేశారు. దాదాపు 70 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ‘ఓజీ’ కోసం మరో రెండు రోజులు టైమ్ కేటాయిస్తే పవన్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిపోతుందట. వీలు చూసుకుని ఆ రెండు రోజుల టైమ్ కేటాయిస్తాననీ త్వరలోనే ‘ఓజీ’ ప్రేక్షకుల ముందుకొస్తుందనీ ఆయన తెలిపారు.
అంతేకాదు, ‘ఓజీ’ సినిమా చాలా బాగుంటుందని ఖచ్చితంగా ప్రేక్షకుల ముందుకొస్తుంది చూద్దురుగానీ బావుంటుంది.. అని పవన్ కళ్యాణ్ తెలిపారు. రాజకీయంగా చేయాల్సిన కొన్ని చిన్న చిన్న పనుల్ని చక్కబెట్టేసి షూటింగ్‌కి హాజరవుతా.! అన్నారాయన.
రీసెంట్‌గా పిఠాపురంలో జరిగిన ఓ మీటింగ్‌లో డిప్యూటీ సీఎం హోదాలో వుండి పవన్ కళ్యాణ్ చెప్పిన ఈ మాటలు ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపాయ్. అలాగే నిర్మాతల్లో కూడా.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







