పెళ్లి వార్తలపై నివేదా థామస్ అలా చెక్ పెట్టేసింది.!
- July 05, 2024
హీరోయిన్ల పెళ్లి వార్తలంటే ఎప్పుడూ క్రేజీ న్యూసే. కొన్ని ప్రచారాలు కొన్ని సార్లు నిజమవుతుంటాయ్. కొన్ని మాత్రం ప్రచారాలుగానే మిగిలిపోతుంటాయ్. రీసెంట్‌గా ‘జెంటిల్‌మెన్’ బ్యూటీ నివేదా థామస్ పైనా పెళ్లి వార్తలు గుప్పుమన్నాయ్.
అయితే తాజాగా ఆమె తన పెళ్లి పుకార్లకు చెక్ పెట్టేసింది. ఈయనే నా భర్త అంటూ తన భర్తను పరిచయం చేయడంతో పాటూ, ఇద్దరు పిల్లల్ని కూడా పరిచయం చేసింది.
అసలు మ్యాటర్ ఏంటంటే, నివేదా థామస్ తాజాగా ‘35 చిన్న కథ కాదు’ అనే సినిమాలో నటిస్తోంది.
ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో భాగంగా రిలీజైన టీజర్ ఈవెంట్‌లోనే తన భర్త, ఇద్దరు పిల్లల్ని పరిచయం చేసి క్రేజీ బ్యూటీ అనిపించుకుంది నివేదా థామస్.
ఈ సినిమాలో పెళ్లయ్యి ఇద్దరు పిల్లలకు తల్లిగా నటిస్తోంది నివేదా థామస్. పిల్లలు, చదువులు, వారి మార్కులు.. ఆయా సందర్భాల్లో పిల్లల భావోద్వేగాలు.. ఈ నేపథ్యంలో రూపొందిన సినిమానే ‘35 చిన్న కథ కాదు’. టీజర్ బాగుంది.
హిలేరియస్‌గా వుండడంతో పాటూ, ఎమోషనల్ సీన్లు కూడా ఆకట్టుకుంటున్నాయ్. నివేదా పర్‌ఫామెన్స్ మరోసారి నెక్స్‌ట్ లెవల్ అనిపించేలా వుంది. ప్రేక్షకుల రెస్పాన్స్ ఎలా వుండబోతోందో తెలియాలంటే ఆగస్టు 15 వరకూ ఆగాల్సిందే.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







