రెండో బింబిసారుడు రెడీ అవుతున్నాడు.! కానీ.!
- July 06, 2024
కొత్త దర్శకుడు వశిష్ట, కోవిడ్ టైమ్‌లో తెరకెక్కించిన ఫాంటసీ చిత్రం ‘బింబిసార’. మంచి విజయం అందుకుంది. లిమిటెడ్ సోర్సెస్‌లో తెరకెక్కిన ఈ సినిమాకి బాక్సాఫీస్ వద్ద మంచి టాక్ వచ్చింది. భారీ వసూళ్లు రాబట్టింది.
విమర్శకుల ప్రశంసలు అందుకుంది ఈ సినిమా. అంతేకాదు, ఈ సినిమాతోనే పరిచయమైన దర్శకుడు వశిష్ట ఏకంగా రెండో సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవినే డైరెక్ట్ చేసేంత గోల్డెన్ లక్ చేజిక్కించేసుకున్నాడు కూడా.
ఈ సినిమా టైమ్‌లోనే ‘బింబిసార 2’ కూడా వుంటుందని ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, వశిష్ట దర్శకత్వంలోనే ‘బింబిసార 2’ వుంటుందనుకున్నారంతా.
కానీ, సీక్వెల్ అయితే వుంది కానీ, దర్శకుడు మాత్రం మారిపోయాడు. అనిల్ పాడూరి దర్శకత్వంలో వెరీ రీసెంట్‌గా ‘బింబిసార 2’ సినిమా స్టార్ట్ అయ్యింది. అయితే ఇది ‘బింబిసార’కి సీక్వెల్ కాదు. ప్రీక్వెల్.
బింబిసారుడి కథకి కొన్ని యుగాల ముందు జరిగిన కథా నేపథ్యంతో ఈ సినిమా రూపొందుతోంది. కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు. డైరెక్షన్‌తో పాటూ, టెక్నికల్ విజన్‌లోనూ మంచి పట్టున్న అనిల్ పాడూరి ఈ సినిమాని మొదటి పార్ట్‌కి మించిన క్వాలిటీతో తెరకెక్కించబోతున్నాడనీ తెలుస్తోంది. లెట్స్ వెయిట్ అండ్ సీ.!
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







