శనివారం మాత్రమే నాని అలా.! మిగిలిన రోజుల్లో.!
- July 06, 2024
నేచురల్ స్టార్ నాని క్లాస్ రోల్ చేసినా మాస్ రోల్ చేసినా సరే, ఆ పాత్రలో పరకాయ ప్రవేశం చేసేస్తాడు. అయినా పక్కింటి కుర్రోడి ప్రెజెన్స్‌నే నానికి ఎక్కువగా సూట్ అవుతుంటుంది. అలాగే ప్రేక్షకులు ఆయన్ని ఎక్కువగా ఇష్టపడుతుంటారు కూడా.
తాజాగా నాని చేస్తున్న చిత్రం ‘సరిపోదా శనివారం’. ఇదో డిఫరెంట్ యాక్షన్ సినిమా. ఇందులో సూర్య పాత్రలో నాని నటిస్తున్నాడు. ఇంతవరకూ రిలీజ్ చేసిన ఈ సినిమా టీజర్లలో నానిని ఓ భయంకరమైన క్రూరమైన కోపిష్టిగా చూపించారు.
అయితే, తాజాగా మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో సూర్య చాలా కూల్‌గా నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నాడు. సూర్యలోని మరో యాంగిల్ అన్న మాట ఇది. ఈ సినిమాలో శనివారం మాత్రం నాని కోపంగా కనిపిస్తాడు. మిగిలిన రోజుల్లో ఇదే లుక్స్‌లో వుంటాడని తెలుస్తోంది.
మొత్తానికి ఈ లుక్‌లో నానిని చూస్తుంటే చాలా ఆహ్లాదంగా అనిపిస్తోంది. అలాగే, ఈ సినిమా పైనా అంచనాలు బాగా వున్నాయ్. డీవీవీ దానయ్య నిర్మాణంలో ప్యాన్ ఇండియా చిత్రంగా రూపొందుతోన్న ఈ సినిమాకి వివేక్ ఆత్రేయ దర్శకుడు. ప్రియాంక అరుళ్ మోహనన్ హీరోయిన్. ఆగస్ట్ 29న రిలీజ్ కానుంది.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







