సూరత్ లో కుప్పకూలిన అపార్ట్మెంట్–ఏడుగురు దుర్మరణం
- July 07, 2024
గుజరాత్: గుజరాత్ లోని సూరత్ లో ఉన్న సచిన్ పాలి గ్రామంలో శనివారం రాత్రి ఆరు అంతస్తుల అపార్ట్ మెంట్ కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మృతి చెందారు. మరో 15 మంది గాయపడ్డారు. 2017లో నిర్మించిన ఆ అపార్ట్ మెంట్ అనూహ్యంగా ఇప్పటికే శిథిలావస్థకు చేరుకుంది. అందుకే అందులో 30 ఫ్లాట్లు ఉండగా ప్రస్తుతం అందులో ఐదు కుటుంబాలు మాత్రమే నివసిస్తున్నాయి. దీనికితోడు గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు బాగా నానిన భవనం ఒక్కసారిగా కుప్పకూలింది.
ప్రమాద సమయంలో నైట్ డ్యూటీలు ముగించుకున్న వారు ఇళ్లలో నిద్రిస్తున్నారు. సూరత్ లోని వస్ర్త పరిశ్రమలో పనిచేసే యూపీ, బీహార్ కు చెందిన కార్మికులు భవనంలో నివసిస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే సందీప్ దేశాయ్ తెలిపారు.
ప్రమాదవార్త తెలియగానే పోలీసులు, ఎన్డీఆర్ ఎఫ్, ఎస్ డీఆర్ ఎఫ్ సహాయ సిబ్బంది భవన శిథిలాల కింద చిక్కుకున్న బాధితులను కాపాడేందుకు రంగంలోకి దిగారు. శనివారం రాత్రంతా శిథిలాలను తొలగిస్తూనే ఉన్నారు. ఆదివారం ఉదయానికి ఏడు మృతదేహాలను వెలికితీసినట్లు చీఫ్ ఫైర్ ఆఫీసర్ బసంత్ తెలిపారు. సహాయ చర్యలు ఇంకా కొనసాగుతున్నాయని.. అయితే శిథిలాల కింద ఇంకెవరూ చిక్కుకోలేదని భావిస్తున్నట్లు చెప్పారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







