2024 మొదటి త్రైమాసికంలో ఒమన్ GDP వృద్ధి
- July 08, 2024
మస్కట్: ఒమన్ స్థూల దేశీయోత్పత్తి(GDP) ప్రస్తుత ధరల ప్రకారం 0.8 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2024 మొదటి త్రైమాసికం చివరినాటికి OMR10.44 బిలియన్లకు చేరుకుంది(2023లో అదే కాలంలో OMR10.36 బిలియన్లతో పోలిస్తే). నేషనల్ సెంటర్ ఫర్ స్టాటిస్టిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ (NCSI) జారీ చేసిన ప్రాథమిక సమాచారం ప్రకారం.. ముడి చమురు కార్యకలాపాలు OMR2.996 బిలియన్లు, 4.4 శాతం తగ్గాయి. అయితే సహజ వాయువు కార్యకలాపాలు 0.1 శాతం తగ్గి OMR524.40 మిలియన్లకు చేరుకున్నాయి. అదే సమయంలో చమురుయేతర కార్యకలాపాలు 2023 అదే త్రైమాసికం చివరినాటికి OMR6.92 బిలియన్లతో పోలిస్తే 2024 మొదటి త్రైమాసికం చివరిలో OMR7.18 బిలియన్లకు 3.9 శాతం వృద్ధిని నమోదు చేశాయి. మొత్తం పారిశ్రామిక కార్యకలాపాలు 2023 మొదటి త్రైమాసికం చివరినాటికి OMR1.91 బిలియన్లతో పోలిస్తే 2024 మొదటి త్రైమాసికం చివరినాటికి OMR2.01 బిలియన్లకు చేరుకున్నాయి. వ్యవసాయం, అటవీ మరియు చేపలు పట్టే కార్యకలాపాలు OMR277 మిలియన్లకు చేరుకోగా, సేవా రంగ కార్యకలాపాలు OMR 4.89 బిలియన్ కి చేరుకున్నాయి.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







