ఒమన్‌లో OMR23.58 బిలియన్లకు చేరుకున్న లిక్విడిటీ
- July 08, 2024
మస్కట్: ఒమన్‌లో మొత్తం స్థానిక లిక్విడిటీ OMR2.50 బిలియన్లు పెరిగింది. ఏప్రిల్ చివరి నాటికి OMR23.58 బిలియన్లకు చేరుకుంది.2023లో ఇదే కాలంతో పోలిస్తే 12 శాతం పెరుగుదల నమోదు అయ్యిందని నేషనల్ సెంటర్ జారీ చేసిన ప్రాథమిక గణాంకాలు స్పష్టం చేశాయి. ఏప్రిల్ 2023 చివరినాటికి OMR1.75 బిలియన్లతో పోలిస్తే ఏప్రిల్ చివరినాటికి మొత్తం జారీ చేయబడిన నగదు 4.6 శాతం తగ్గి OMR1.66 బిలియన్లకు చేరింది.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఒమన్ (CBO) మొత్తం విదేశీ ఆస్తులు కూడా ఏప్రిల్ 2023 చివరి నాటికి OMR6.56 బిలియన్లతో పోలిస్తే..ఏప్రిల్ 2024 చివరి నాటికి OMR6.77 బిలియన్లకు 3.1 శాతం పెరిగాయి. మొత్తం రుణాలు, ఫైనాన్సింగ్ గత ఏప్రిల్ చివరి నాటికి 2.6 శాతం పెరిగి OMR30.25 బిలియన్లతో పోలిస్తే OMR30.81 బిలియన్లకు చేరుకుంది. మొత్తం రుణాలపై సగటు వడ్డీ రేటు ఏప్రిల్ 2024 చివరి నాటికి 4.4 శాతం పెరిగి 5.604 శాతానికి చేరుకుంది. ఒమానీ రియాల్ మారకపు రేటు ఇండెక్స్ ఏప్రిల్ 2024 చివరి నాటికి 3.9 శాతం పెరిగి 118.4 పాయింట్లకు చేరుకుంది.
తాజా వార్తలు
- త్వరలో వెబ్‌లో గ్రూప్ వీడియో, ఆడియో కాల్స్ సౌకర్యం
- దావోస్ కు బయల్దేరిన చంద్రబాబు, రేవంత్ రెడ్డి
- స్పెయిన్ లో ఘోర రైలు ప్రమాదం.. 21 మంది మృతి
- ఎన్ఆర్ఐ టీడీపీ బహ్రెయిన్ ఆధ్వర్యంలో ఎన్టిఆర్ 30వ వర్ధంతి
- అవాలి అభివృద్ధి మాస్టర్ ప్లాన్ పై కింగ్ హమద్ సమీక్ష..!!
- యూఏఈ దిర్హమ్కు రూ.25కు చేరువలో భారత రూపాయి..!!
- విదేశీ వాహనదారులకు ఖతార్ గుడ్ న్యూస్..!!
- రియాద్ లో దక్షిణ యెమెన్ నాయకులు..కీలక ప్రకటన..!!
- కువైట్ ‘లులు’లో బ్రిటిష్ డెయిరీ ప్రొడక్ట్స్ వీక్..!!
- ఒమన్‌లో 8.5% పెరిగిన బ్యాంకు లోన్లు..!!







