బొగత జలపాతానికి పర్యాటకుల సందడి
- July 08, 2024
హైదరాబాద్: తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండల పరిధిలోని చీకుపల్లి అటవీ ప్రాంతంలో ఉన్న బొగత జలపాతం వద్ద పర్యాటకుల సందడి నెలకొంది. ఆహ్లాదకర వాతావరణంలో జలపాతం అందాలను మొబైల్ ఫోన్లలో చిత్రీకరిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నారు. ఇక నిన్న ఆదివారం కావడంతో పర్యాటకుల తాకిడి భారీగానే కనిపించింది.
కుటుంబ సమేతంగా పిల్లాపాపలతో తరలివచ్చిన పర్యాటకులు బొగత జలపాత ప్రాంగణంలో రోజంతా గడిపి విందులు, వినోదాలతో ఆనందం పొందుతున్నారు. బొగత జలపాతాన్ని సందర్శించిన పర్యాటకులు బహుత లోయలో జలకాలాడటం చేశారు.
అయితే, బొగత జలపాతానికి పర్యాటకుల తాకిడి రోజు రోజుకు పెరుగుతున్నప్పటికీ ఇక్కడ సౌకర్యాలు మాత్రం అంతంత మాత్రమేనని తెలుస్తోంది. ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి ఈ పర్యాటక కేంద్రం వద్ద సకల సౌకర్యాలు కల్పించాలని సందర్శకులు కోరుతున్నారు.
కాగా, బొగత జలపాతం అందాలను ఆస్వాదించేందుకు రాష్ట్ర నలుమూలల నుండే కాకుండా ఛత్తీస్‌గఢ్, ఏపీ నుండి కూడా పర్యాటకులు క్యూకడుతుంటారనే విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







