‘టిల్లు క్యూబ్’లో ఆ హీరోయినా.?
- July 09, 2024
‘డీజె టిల్లు’ సినిమాతో సంచలన విజయం అందుకున్న సిద్దు జొన్నలగడ్డ ఆ తర్వాత ‘టిల్లు స్క్వేర్’తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా మొదటి పార్ట్ అంత కాకపోయినా, ఓ మోస్తరు హిట్ టాక్‌తో ఈ సినిమా నెట్టుకొచ్చేసింది.
అయితే, ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన అనుపమా పరమేశ్వరన్ మాత్రం క్రేజీ హీరోయిన్ అయిపోయింది. స్టన్నింగ్ క్యారెక్టర్లో కనిపించి వావ్ అనిపించింది.
ఇప్పుడు ఈ సినిమాకి మూడో పార్ట్ కూడా తెరకెక్కబోతోందట. ఆ పార్ట్‌లో హీరోయిన్ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. ‘ట్యాక్సీవాలా’ ‘ఎస్ ఆర్ కళ్యాణ మండపం’ తదితర సినిమాల్లో నటించిన ప్రియాంకా జవాల్కర్‌ని ఈ సినిమాలో హీరోయిన్గా అనుకుంటున్నారట.
ఈ ముద్దుగుమ్మ చేసినవి తక్కువ సినిమాలే అయినా మస్త్ క్రేజ్ వుంది యూత్‌లో. టిల్లుగానికున్న క్రేజ్‌కి అందుకు తగ్గట్లు క్రేజ్ వున్న ముద్దుగుమ్మ అయితేనే బాగుంటుందని అనుకుంటున్నారట. ఆ నేపథ్యంలో ప్రియాంక పేరు పరిశీలిస్తున్నారని తెలుస్తోంది.
ఒకవేళ అదే జరిగితే, ప్రియాంకా జవాల్కర్ దశ తిరిగినట్లే. మళ్లీ ఫామ్‌లోకి రావడం పక్కా.
తాజా వార్తలు
- గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయ స్థలాల పై AAI పరిశీలన..!
- అగ్నిపర్వతం బద్దలు..301 విమాన సర్వీసులకు అంతరాయం
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ అధ్యక్షుడితో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం







