‘ఇండియన్ 2’లో ఆ అద్భుతాలున్నాయట.!
- July 09, 2024
దాదాపు 30 ఏళ్ల క్రితం సంచలన విజయం అందుకున్న సినిమా ‘భారతీయుడు’. ఆ సినిమాకి ఇన్నేళ్ల తర్వాత సీక్వెల్ రూపొందించారు. ఈ సీక్వెల్ రూపొందించడానికి దాదాపు ఆరేళ్లు సమయం పట్టింది. ఇది చిన్న విషయం కాదు.
ఈ టైమ్‌లో టీమ్ ఎదుర్కొన్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు. ఓ వైపు కోవిడ్, లాక్‌డౌన్, అగ్ని ప్రమాదం జరిగి ఇద్దరు టెక్నీషియన్ల మరణం.. ఆ తర్వాత కూడా కొన్ని అనారోగ్యాల కారణంగా కొందరు ఆర్టిస్టులు కూడా మరణించారు ఈ సినిమాకి సంబంధించి.
వాళ్లలో నెడుమూడి వేణు, వివేక్ వున్నారు. ఈ నటుల పాత్రలకు సంబంధించి కొంతమేర షూటింగ్ చేశారు. ఆ తర్వాత వారు మరణించారు. వారికి సంబంధించిన పెండింగ్ సన్నివేశాల్ని ఆధునిక టెక్నాలజీ యూజ్ చేసి చిత్రీకరించారట.
సాధారణంగా అయితే, పాత సీన్లు తీసేసి కొత్త నటుల్ని పెట్టుకుని రీ షూట్ చేయొచ్చు. కానీ, శంకర్ అండ్ టీమ్ అలా చేయలేదు. వారి గుర్తుగా ఆయా సన్నివేశాలను అలాగే వుంచేశారట. అవసరమైన మరికొన్ని సన్నివేశాలను టెక్నాలజీ సాయంతో చిత్రీకరించారట. నిజంగా ఇదో అద్భుతమే అని చెప్పాలి. ఇలాంటి ఎన్నో అద్భుతాలకు నెలవైన ‘ఇండియన్ 2’ చిత్రం ఈ నెల 12న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రపంచం మొత్తం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తోంది ఈ సినిమాని వీక్షించేందుకు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







