ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం..
- July 09, 2024
రష్యా: ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీకి అరుదైన గౌరవం దక్కింది. రష్యా అత్యున్నత పౌర పురస్కారమైన 'ఆర్డర్ ఆఫ్ సెయింట్ ఆండ్రూ ది అపోస్టల్'తో ఆ దేశ అధ్యక్షడు వ్లాదిమీర్ పుతిన్..
మోదీని సత్కరించారు. 2019లో కూడా మాస్కోలో సెయింట్ కేథరీన్స్ హాల్‌లో ప్రధాని మోదీకి పుతిన్ ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. దాదాపు ఐదేళ్ల తర్వాత మరోసారి మోదీకి ఈ అత్యున్నత పౌర పురస్కారం లభించింది. రష్యా-భారత్ మధ్య స్నేహపూర్వకమైన, వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పెంపొందించడంలో మోదీ చేసిన కృషికి గానూ ఈ పురస్కారాన్ని అందించారు.
ఈ పురస్కారం స్వీకరించిన అనంతరం ప్రధాని మోదీ మాట్లాడారు. రష్యా అత్యున్నత పౌర పురస్కారంతో తనను సత్కరించినందుకు పుతిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ గౌరవం నా ఒక్కనికి మాత్రమే కాదని.. 140 కోట్ల భారత ప్రజల సొంతమని వ్యాఖ్యానించారు. అలాగే రష్యా-భారత్ మధ్య శతాబ్దాలుగా ఉన్న స్నేహం, పరస్పర నమ్మకానికి గౌరవమని అన్నారు. గత రెండున్నర దశాబ్దాలుగా.. పుతిన్ నాయకత్వంతో భారత్-రష్యా మధ్య సంబంధాలు మరింత బలపడ్డాయని అన్నారు. ఇరుదేశాల మధ్య పరస్పర సహాకారం మన ప్రజలకు మంచి భవిష్యత్తు అందించే దిశగా వెళ్తోందన్నారు.
తాజా వార్తలు
- శంకర నేత్రాలయా ఫండ్రైజింగ్ సంగీత విభావరి–2025 ఘన విజయం
- టూరిస్టుల కోసం విశాఖ తీరంలో మెగా సెలబ్రేషన్స్
- సైబర్ మోసగాళ్ల కొత్త వ్యూహాలు..జాగ్రత్త తప్పనిసరి!
- మచిలీపట్నం–అజ్మీర్ మధ్య ప్రత్యేక రైలు: ఎంపీ వల్లభనేని బాలశౌరి
- శంకర నేత్రాలయ 2025 సాల్ట్ లేక్ సిటీ నిధుల సేకరణ కార్యక్రమం ఘనవిజయం
- కాగ్నిజెంట్ లో 25వేల మందికి ఉద్యోగాలు: CEO రవికుమార్
- కీలక నిర్ణయాలు తీసుకున్న కేంద్ర కేబినెట్
- భారీగా పౌరసత్వాన్ని వదులుకున్న భారతీయులు
- ప్రపంచ సమ్మిట్ AI..ఆకట్టుకుంటున్న ఖతార్ AI ప్రాజెక్టులు..!!
- GOSI 10వ ఎడిషన్ ఎలైట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!







