టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌గంభీర్‌..

- July 09, 2024 , by Maagulf
టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌతమ్‌గంభీర్‌..

న్యూ ఢిల్లీ: టీమ్ఇండియా హెడ్ కోచ్‌గా గౌత‌మ్ గంభీర్ నియ‌మితుల‌య్యాడు. ఈ విష‌యాన్ని బీసీసీఐ కార్య‌ద‌ర్శి జై షా సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించారు. గంభీర్ అనుభ‌వం జ‌ట్టుకు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని జై షా చెప్పారు.

భారత క్రికెట్ జట్టు కొత్త ప్రధాన కోచ్‌గా గౌతమ్ గంభీర్‌ని నేను స్వాగతిస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఆధునిక క్రికెట్ వేగంగా అభివృద్ధి చెందింది. ఈ మార్పు ప్ర‌క్రియ‌ల‌ను గంభీర్ చాలా దగ్గ‌ర నుంచి చూశాడు. త‌న కెరీర్‌లో ఎన్నో క‌ష్టాల‌ను త‌ట్టుకుని వివిధ పాత్ర‌ల్లో రాణించాడు. భారత క్రికెట్‌ను ముందుకు నడిపించడానికి గౌతమ్ ఆదర్శవంతమైన వ్యక్తి అని నాకు నమ్మకం ఉంది. టీమ్ఇండియా పట్ల అతని అవ‌గాహ‌న‌, ముందుచూపు, త‌న అనుభ‌వంతో కోచింగ్ పాత్రను అత‌డు స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌ర్తిస్తాడ‌ని న‌మ్ముతున్నాను. అని జై షా అన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com