2026 నాటికి భోగాపురం విమానాశ్రయం పూర్తి: కేంద్ర మంత్రి రామ్మోహన్
- July 09, 2024
భోగాపురం: 2026 నాటికి భోగాపురం విమానాశ్రయంను అందుబాటులోకి తెస్తామని చెప్పారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు.నేడు విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయం ప్రాంతాన్ని పరిశీలించారు.ఎల్లుండి సీఎం చంద్రబాబు భోగాపురం విమానాశ్రయ పనుల పరిశీలనకు వస్తున్నారు.సీఎం పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను కూడా ఆయన పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ…ఉత్తరాంధ్ర ప్రాంతానికి భోగాపురం ఎవిమానాశ్రయం గుండెకాయ వంటిదని అభివర్ణించారు.నిర్ణీత సమయంలోనే భోగాపురం విమానాశ్రయం పూర్తి చేస్తామని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా దృష్టి సారించారని రామ్మోహన్ నాయుడు తెలిపారు.విమానాశ్రయ పనులపై సీఎం చంద్రబాబు సూచనలు కూడా తీసుకుంటామని అన్నారు.కేంద్రం నుంచి ఎలాంటి అనుమతులు కావాలన్నా వెంటనే వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వం విమానాశ్రయ పనులను ఆలస్యం చేసిందని ఆరోపించారు.డిసెంబరు నాటికి టెర్మినల్ భవనం పూర్తి చేస్తామని చెప్పారు.చిన్న చిన్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు.
విమానాశ్రయం పూర్తయితే దాదాపు 6 లక్షల మందికి ఉపాధి కలుగుతుందని అన్నారు. ఉత్తరాంధ్ర జిల్లాల వారే కాకుండా ఒడిశా వాసులకు కూడా భోగాపురం విమానాశ్రయం ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు.దీన్ని సరిగ్గా సద్వినియోగం చేసుకోగలిగితే, భవిష్యత్తులో ఉత్తరాంధ్రకు ఎన్నో కంపెనీలు వస్తాయని తెలిపారు. గత ప్రభుత్వం ప్రాజెక్టులు పూర్తి చేయలేక, గడువులు పెంచుకుంటూ పోయిందని, కానీ తాము అధికారంలోకి వచ్చాక మొట్టమొదటి నెలలోనే ప్రాజెక్టును సందర్శించి, గడువు తేదీ చెబుతున్నామని, ఈ విషయాన్ని తాము ఓ బాధ్యతగా తీసుకుంటున్నామని వివరించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో మధ్యప్రదేశ్ ప్రత్యేక ODOP ఉత్పత్తుల ప్రదర్శన
- గ్రేటర్ పారిస్‌లో ‘నమస్తే’ శిల్పం ఆవిష్కరణ
- దుబాయ్‌లో అరబ్ పార్లమెంట్ స్పీకర్‌తో మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ భేటీ
- ఎడారీకరణ నియంత్రణకు సౌదీ అరేబియా, కువైట్ సంయుక్త చర్యలు
- హిజ్రాల పై ఫిర్యాదులు.. స్పందించిన డీజీపీ సి.వి.ఆనంద్
- ఉన్నత విద్యలో సంస్కరణలు, పరిశోధనలకు ప్రాధాన్యమివ్వాలి: టి.గవర్నర్
- ఖతార్‌లో ప్రజలకు పోలీసుల సూచనలు..QID వెంట ఉంచుకోవాలి
- దుబాయ్ బతుకమ్మ వేడుకలకు కేటీఆర్‌కు ఆహ్వానం
- దుబాయ్ పోలీసుల్లో 36 ఆర్పీఏ రోబోలు..
- తెలంగాణలో కొత్త క్రిమినల్ చట్టాల అమలు పై NCRB డైరెక్టర్ సమీక్ష







